వృద్దురాలికి లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచుకున్నాడు…

Chain snatching

 

నిజామాబాద్‌: ఓ వృద్ధురాలి నుంచి ద్విచక్ర వాహనదారుడు బంగారం దోచుకున్న ఘటన వేల్పూర్ మండలంలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం… జిల్లాలోని వేల్పూర్ మండలం పడగల్ అడ్డరోడ్డు దగ్గర గంగు అనే వృద్ధురాలు అప్పుడే బస్సు దిగింది. దీంతో అటు నుంచి వచ్చిన ద్విచక్ర వాహనదారుడు తనను ఊర్లోకి తీసుకెళ్లతానని మాయ మాటాలు చెప్పి నమ్మించి బైక్ పై ఎక్కించుకున్నాడు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ ను ఆపి వృద్ధిరాలి మెడలో ఉన్న తులన్నర బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. దీంతో గంగు రోడ్డుపై కూర్చోని ఏడుస్తుండడం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Chain snatching at velpur in Nizamabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వృద్దురాలికి లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచుకున్నాడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.