బిజెపికి బుద్ధి చెప్పాలి: చాడ వెంకట్‌రెడ్డి

Chadha-Venkatreddyహుజూర్‌నగర్‌టౌన్:  మతోన్మాద బిజెపికి హుజూర్‌నగర్ ఉప ఎన్నికల నుంచే బుద్ధి చెప్పాలని సిపిఐ పార్టీరాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలోని ధనలక్ష్మీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సిపిఐ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో సిపిఐ టిఆర్‌ఎస్‌కు మద్దతిచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే టిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్, బిజెపిలో రోజు రోజుకూ తెలంగాణాలో నిర్వీర్యం అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో తెరాసా సమర్ధ పాలన అందించే శక్తి ఉందని హర్షం వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్ ప్రజలు తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో తెరాస ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, తెరాస అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డి, పాలకూరి బాబు, ఉస్తెల సృజన, పాలకూరి బాబు, గన్నా చంద్రశేఖర్, గుండు వెంకటేశ్వర్లు, ఎల్లావుల రాములు తదితరులున్నారు.

Chadha Venkat Reddy Comments on BJP

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బిజెపికి బుద్ధి చెప్పాలి: చాడ వెంకట్‌రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.