ఒక్క ఓటుకు రెండు నిమిషాలు!

ఈ నెల 11కే పెట్టాలంటే.. మినహాయింపులు ఇవ్వాలే నిజామాబాద్‌లో ఎన్నికపై ఇసిని కోరిన సిఇఒ మన తెలంగాణ/హైదరాబాద్: సాధారణంగా ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తరువాత అధికారులు వివరాలు సరిచూసుకుని, ఓటు వేసేందుకు అనుమతిస్తే ఒక్క నిమిషం లోపు ఈ ప్రక్రియ ముగుస్తుంది. అయితే మాములుగా పోటీలో ఉండే అభ్యర్థులు తక్కువగా ఉంటే ఒక బ్యాలెట్, 16 దాటితే రెండు బ్యాలెట్ యూనిట్లు వాడుతారు కనుక పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ […]

ఈ నెల 11కే పెట్టాలంటే.. మినహాయింపులు ఇవ్వాలే
నిజామాబాద్‌లో ఎన్నికపై ఇసిని కోరిన సిఇఒ

మన తెలంగాణ/హైదరాబాద్: సాధారణంగా ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తరువాత అధికారులు వివరాలు సరిచూసుకుని, ఓటు వేసేందుకు అనుమతిస్తే ఒక్క నిమిషం లోపు ఈ ప్రక్రియ ముగుస్తుంది. అయితే మాములుగా పోటీలో ఉండే అభ్యర్థులు తక్కువగా ఉంటే ఒక బ్యాలెట్, 16 దాటితే రెండు బ్యాలెట్ యూనిట్లు వాడుతారు కనుక పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో 1788 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కొ కేంద్రానికి 12 చొప్పున బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటికి ఒక్క కంట్రోల్ యూనిట్‌కు జత చేయనున్నారు. అయితే ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేందుకు 12 బ్యాలెట్ యూనిట్లను సరిచూసుకోవాల్సి ఉంటుంది. అవి చూసుకున్నక నచ్చిన అభ్యర్థికి బ్యాలెట్ యూనిట్‌పై మీట నొక్కాలి.

12 బియూలు ఉన్నందున ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో నిజామాబాద్ ఎంపి ఎన్నికల్లో ఓటరు ఓటు హక్కు వేసేందుకు కనీసం ఒకటి నుంచి రెండు నిమిషాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో పోలింగ్ సమయం పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా కంట్రోల్ యూనిట్‌లలో సమయాన్ని 12 గంటలకు పైగా మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని సిఇఒ రజత్ కుమార్ ఇసిని కోరారు. అలాగే గడువు లోగా నిజామాబాద్‌కు ఈ నెల 11న ఎన్నిక నిర్వహించాలంటే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని సిఇఒ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇసికి ఒక లేఖ రాశారు. దీని ప్రకారం..

ఓటింగ్ ప్రక్రియలో బ్యాలెట్ యూనిట్ బ్యాటరీ ఫెయిల్ అయితే బ్యాటరీని మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.
సాధారణంగా ఇవిఎంల ర్యాండమైజేషన్‌కు ఇఎంఎస్ అనే ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. దాని ప్రకారమే ర్యాండమైజేషన్ చేస్తారు. సాప్ట్‌వేర్‌తో చేసే సమయం లేనందున ఎం.ఎస్ ఎక్సల్ ద్వారా చేసేందుకు అనుమతించాలని ఇసిని కోరారు.
మొదటి దశ తనిఖీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో నిర్వహించాలి. ఎఫ్‌ఎల్‌సిని 150 మంది ఇంజనీర్లతో ఐదు రోజుల పాటు రోజు 18 గంటల పాటు నిరంతరాయంగా నిర్వహించాల్సి ఉంటుంది. కేవలం గిడ్డంగుల్లో మాత్రమే కాకుండా నాన్ డిసిగ్నేటేట్ ప్రాంతాలు (ఉదాహరణకు ఫంక్షన్‌హాల్స్)లో ఎఫ్‌ఎల్‌సి చేసేందుకు అనుమతించాలి. అలాగే రెండో దశ ర్యాండమైజేషన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేయాల్సి ఉంటుంది. ఇది కూడా జిల్లా కేంద్రంలోనే చేసేందుకు అనుమతించాలి.
పోలింగ్ మొదలైన తరువాత ఏదైనా ఇవిఎం(బియూ, సియూ) మొరాయిస్తే, మొత్తం సెట్‌ను రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత 185 మంది అభ్యర్థులకు చెందిన ఏజేంట్లు ఒక్కొ ఓటు వేసి, మాక్ పోల్ చేయాలి.

CEO Rajath Kumar talk about Nizamabad Parliament Election

Related Stories: