మాజీ ప్రధాని పివి పేరిట స్పెషల్ పోస్టల్ స్టాంప్

Central Govt Release Postal Stamp in Honour of PVఢిల్లీ: మాజీ ప్రధాని పివి నర్సింహారావు పేరిట ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణకు చెందిన పివి శత జయంతి ఉత్సవాలు ఈ నెల 28న ప్రారంభమైన విషయం తెలిసిందే. పివికి భారతరత్న ఇవ్వాలని, ఆయన పేరిట ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని తెలంగాణ సిఎం కెసిఆర్ కేంద్రాన్ని కోరిన విషయం విదితమే.  ఈ క్రమంలో  పివి పేరిట ప్రత్యేక స్పెషల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. పివికి కాంగ్రెస్ సరైన గుర్తింపు ఇవ్వలేదని, దేశానికి చేసిన ఆయన సేవలను గుర్తించలేదని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పివిని గుర్తించి, సముచిత రీతిలో గౌరవించాలని ఆయన సూచించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణలు తెచ్చిన ఘనత పివిదని ఆయన వెల్లడించారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మాజీ ప్రధాని పివి పేరిట స్పెషల్ పోస్టల్ స్టాంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.