సామాజిక విలువల విద్య ఏదీ!?

  విద్యావ్యవస్థలో ఇటీవల నెలకొన్న భారీ మార్పులను గమనిస్తే విశ్వవిద్యాలయాల స్థాయిలో సమూల మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు భావించవలసి వస్తున్నది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ను రద్దు చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల భవిష్యత్తులో మానవీయ శాస్త్రాల బోధన కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. విశ్వవిద్యాలయాలలో విద్యా బోధన మానవీయ శాస్త్రాలు, సైన్స్ కోర్సులు, కామర్స్ అని మూడు విభాగాలుగా విభజించడం ఉండేది. ప్రస్తుతం ఈ కోర్సుల నిర్వహణ […] The post సామాజిక విలువల విద్య ఏదీ!? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విద్యావ్యవస్థలో ఇటీవల నెలకొన్న భారీ మార్పులను గమనిస్తే విశ్వవిద్యాలయాల స్థాయిలో సమూల మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు భావించవలసి వస్తున్నది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ను రద్దు చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల భవిష్యత్తులో మానవీయ శాస్త్రాల బోధన కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. విశ్వవిద్యాలయాలలో విద్యా బోధన మానవీయ శాస్త్రాలు, సైన్స్ కోర్సులు, కామర్స్ అని మూడు విభాగాలుగా విభజించడం ఉండేది. ప్రస్తుతం ఈ కోర్సుల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పవచ్చు! 1992లో వచ్చిన నూతన ఆర్థిక ప్రపంచీకరణ విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా అమలవుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలనూ అనుసంధానం చేస్తున్నది.

ప్రపంచీకరణ నూతన ఆర్థిక విధానం భారతదేశంలో ఒక కొత్త తరహా పరిపాలన వ్యవస్థకు నాంది పలికాయి. కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన కోర్సులను డిగ్రీ స్థాయి నుంచి పిజి స్థాయి వరకు రూపొందించడం జరిగింది. మొదట్లో ఈ కోర్సులకు విపరీతమైన ఆదరణ ఉండేది. అందుకు తగ్గట్టుగానే ప్రతి విశ్వవిద్యాలయంలో, అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న కొత్త తరహా కోర్సులతో ప్రయివేట్ డిగ్రీ కళాశాలలు, పిజి కళాశాలలు ఏర్పడ్డాయి. ప్రైవేట్, స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాలు వందల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. ఇటువంటి విశ్వవిద్యాలయాల్లో విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ఈ మార్పుతోనూ బాగా డబ్బు గల పిల్లలను ఆకట్టుకోడానికి ఈ విధంగా సాంకేతిక విద్యా విధానం అమలులోనికి రావడంతో ఈ కోర్సులను చదువుకోవడానికి ఆసక్తి చూపారు. సర్వసాధారణంగా కలవారి పిల్లలు ఆధునిక హంగులు కలిగిన రంగురంగుల బంగళాలలో చదువుకోవాలనే ఆసక్తి పెంచుకుంటారు. వారి తల్లిదండ్రులు మానవీయ విలువలు బోధించని కోర్సుల వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు.

ఇందులో 30 శాతం వరకు విద్యార్థులు ఆధునిక కోర్సులను వైపు మొగ్గు కనపరుస్తున్నారు. కొత్తగా ఎక్కడైనా డిగ్రీ కళాశాలో పిజి కళాశాలో ప్రారంభిస్తే అందులో బిఎ, ఎంఎ కోర్సులను బోధించడం ప్రైవేట్ యాజమాన్యాలు నామోషీగా భావిస్తాయి. మా కళాశాలలో కేవలం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సైన్స్ కోర్సులను మాత్రమే అందిస్తున్నట్లు ప్రసార మాధ్యమాలలో ప్రసారాలు చెప్పుకొంటాయి. బిఎస్‌సి, బికాం, ఎంఎస్‌సి, ఎంకామ్, ఎంసిఎ, బిసిఎ, వంటి కోర్సులను ప్రవేశపెట్టడానికి ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలలో కూడా పైన పేర్కొన్న కోర్సుకు గిరాకీ పెరిగింది. కంప్యూటర్లను కంటికి రెప్పలా కాపాడడానికి గాజు పలకలతో కూడిన రూములను తయారుచేసి అందులో ఎయిర్ కండిషన్ ఏర్పాటుచేసి ఈ కోర్సులను నిర్వహించడమైంది. సామాజిక విలువలు మానవీయ విలువలు నేర్పలేని ఈ కోర్సులు విద్యార్థులలో ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందించంలో విఫలమయ్యాయి.

ఈ చదువుల్లో సమస్యల్ని ఎదుర్కోవడంలో విద్యార్థులకు నైతిక స్థైర్యాన్ని నేర్పక పోవడం వల్లనే వారు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి దిగజారిపోవడం మనం చూస్తున్న విషయమే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో ఫెయిల్ అయినామని భావించిన విద్యార్థులు ఇక జీవితం లేదని ఇంటర్మీడియట్ తోనే తమ జీవితం అయిపోయిందని భావించి చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాలడ్డారు. దీనికి ప్రధానమైన కారణం, కార్పొరేట్ విద్యా వ్యవస్థే అని చెప్పవచ్చు. అపార్‌మెంట్ చదువులు అమలులోనికి వచ్చిన తర్వాత విద్యార్థులకు సమాజానికి మధ్య మానవీయ సంబంధాలు లేకుండా పోయాయని చెప్పవచ్చు. ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో ప్రధానంగా చెప్పుకోబడిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేడు ఆర్థిక కుటుంబ వ్యవస్థగా రూపాంతరం చెంది, చిన్న కుటుంబాల వ్యవస్థగా మారిపోయింది. దీనికి ప్రధానమైన కారణం నూతన ఆర్థిక విధానం ప్రపంచీకరణలే.

నాగరిక సమాజానికి నాందిగా చెప్పుకోబడే వ్యవసాయం, నిప్పు ఈ రెండూ మానవ జీవితంలో గొప్ప మార్పును తీసుకు వచ్చాయి. ఆటవిక జీవితం నుండి ఆధునిక హంగులతో కూడిన జీవితాన్ని గడుపుతున్న మానవ సమాజం ఒక్కసారి వెనుకకు చూసుకోవాలి. ఆధునిక విజ్ఞానాన్ని ఆదరించదగినదే కాని మానవీయ విలువలతో కూడిన విజ్ఞానాన్ని అభివృద్ధి పరచవలసి ఉంది. జ్ఞానంతోనే ప్రపంచాన్ని జయించాలి అని సోక్రటీస్ చెప్పిన మాటలు చాలా నిజమవుతున్నాయి, సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి వాటిని తట్టుకొని నిలదొక్కుకునే కలిగే వ్యక్తిత్వం కలిగిన వ్యవస్థను రూపొందించడానికి తల్లిదండ్రులు, ప్రభుత్వాలు పూనుకోవాలి. భారతదేశంలో ఉన్నత విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఆశిస్తున్న తరుణంలో సమాజ రుగ్మతలను ఇప్పటికైనా గమనించి మానవీయ విలువలతో కూడిన విజ్ఞానాన్ని నేర్పడానికి ప్రభుత్వాలు కృషి చేశౠయి. విలువలు అడుగంటి పోవడమే అకృత్యాలు జరగడానికి కారణం. సమాజంలో జరిగే సంఘటనల వెనుక కార్యకారణ సంబంధాలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రెండు సంవత్సరాల పిల్లవాడు మొదలు కొంటే 90 సంవత్సరాల వయసు గల వృద్ధుల వరకు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం అందుబాటులో ఉంది. 2015 నాటికి దేశంలో స్మార్ట్ ఫోన్లు 20 కోట్ల మంది వాడేవారు. 2019 నాటికి ఆ సంఖ్య 37.4 కోట్లకు చేరుకుంది. 2022 నాటికి 44.2 కోట్ల మంది స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తారని అంచనా వేయవచ్చు! దీనినిబట్టి చూస్తే ఆధునిక సాంకేతిక విజ్ఞానం అరచేతిలోనే ఉండటంవల్ల పక్కవాడు ఏం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని తెలుస్తుంది దీనంతటికీ ప్రధానమైన కారణం సామాజిక అవగాహన లేకపోవడమే. ఇటీవల జరిగిన సర్వే వల్ల వెల్లడైన ఆసక్తికరమైన విషయాలు ఉదయం 6 నుండి రాత్రి 12 ఒంటిగంటల వరకు స్మార్ట్ ఫోన్ వినియోగం తోనే యువత కాలం గడుపుతున్నందునే అనర్థాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు! మనిషి జీవితంలో సుఖం బాధ ఆనందం జయాపజయాలు కలిగి ఉంటాయి ప్రతి తరం వారు వర్తమాన తరానికి ఈ విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది! ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏడాదికి 220, – 250 రోజులు మాత్రమే పాఠశాలలు కళాశాలలు పనిచేస్తాయి! కార్పొరేట్ విద్యా వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యార్థికి కేవలం పుస్తకాలలో తలకాయ పెట్టి వంగి కూర్చొని చదువుకోవలసిన అవసరంఏర్పడింది. మార్కులనే కొలమానంగా తల్లిదండ్రులు భావించినంత కాలం నవ సమాజ నిర్మాణంలో మానవీయ విలువలకు ఏ మాత్రం చోటు లభించదు.

Central Government decided to changes in University

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సామాజిక విలువల విద్య ఏదీ!? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: