ఆంధ్రాకు రెండు…. తెలంగాణకు నిల్

  హైదరాబాద్ : కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న 50 కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం తెలియజేసింది. పౌర, రక్షణ విభాగాల కింద మొత్తం 50 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అందులో  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద 15, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కింద 6, రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 29 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం కేటాయించింది. ఈ 50 కేంద్రీయ విద్యాలయాల్లో తెలంగాణ ఒక్కటి కూడా ఇవ్వకుండా కేంద్రం […]

 

హైదరాబాద్ : కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న 50 కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం తెలియజేసింది. పౌర, రక్షణ విభాగాల కింద మొత్తం 50 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అందులో  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద 15, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కింద 6, రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 29 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం కేటాయించింది. ఈ 50 కేంద్రీయ విద్యాలయాల్లో తెలంగాణ ఒక్కటి కూడా ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపింది. అయితే ప్రక్క రాష్టమైన ఆంధ్రప్రదేశ్‌కు రెండు కేంద్రీయ విద్యాలయాలను ఇస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. అందులో గుంటూరు జిల్లా నాదేండ్ల మండలం, ఈర్లపాడు గ్రామంలో ఒకటి, మరోకటి ప్రకాశం జిల్లా కందుకూరులో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

Central Government announced 50 Kendriya Vidyalayas

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: