టైం దొరికితే చాలు!

Celebrity childrens

 

టైం దొరికితే చాలు!

ఎన్‌టిఆర్, ఏఎన్‌ఆర్ తరంవాళ్లు సినిమా షూటింగ్‌ల్లో పడి తమ పిల్లల ఆలనాపాలనా చూడలేకపోయారనే విషయం తెలిసిందే.ఇప్పటి వాళ్లు మాత్రం ఏమాత్రం సమయం దొరికినా తమ సంతానానికే కేటాయిస్తున్నారు. వారి ముద్దు మాటల్నీ చేష్టల్నీ చూసి ఆనందిస్తూ, వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు పంచుతున్నారు కూడా. హీరోలు మహేష్ బాబు, అల్లుఅర్జున్, జూ.ఎన్టీఆర్, నానీ, గోపీచంద్ లాంటివారు షూటింగ్ అయిన తర్వాత కాస్త సమయం దొరికితే మాత్రం తమ చిన్నారులతో ఆడుకుంటూ గడుపుతున్నారు. ఈ మధ్య హీరోల కంటే వాళ్ల పిల్లలే స్మాల్ సెలబ్రిటీలవుతున్నారు. బన్నీ కొడుకు అయాన్‌కు పుట్టినరోజు కానుకగా స్విమ్మింగ్ పూల్‌ను ఇచ్చాడు తాత అల్లు అరవింద్. దానికి అల్లు పూల్ అని పేరు పెట్టాం అంటూ ఇన్‌స్టాలో బన్నీ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా సెట్‌లో తన కుమార్తెతో సరదాగా సమయం గడిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ఆయన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. సితార ఎప్పుడూ తనకు ఒత్తిడి నుంచి ఉపశమనం కల్గిస్తుందంటున్నాడు.

 

Celebrity childrens

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టైం దొరికితే చాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.