జైట్లీకి ప్రముఖుల నివాళి

Arun Jaitleyఢిల్లీ : బిజెపి అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన పార్ధివదేహాన్ని బిజెపి ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా జైట్లీకి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, బిజెపి ఎంపి కిరణ్‌ ఖేర్‌, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ , కాంగ్రెస్‌ నేత మోతీలాల్‌ వోరా, ఎన్సీపీ నేతలు శరద్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌, ఆర్‌ఎల్డీ నేత అజిత్‌ సింగ్‌, ఎపి మాజీ సిఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు తదితరులు నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా యుపిఎ చైర్ పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జైట్లీ భార్య సంగీతా జైట్లీకి సంతాప లేఖ రాశారు. దేశానికి జైట్లీ చేసిన సేవలను ఆమె తన లేఖలో గుర్తు చేశారు. మనోధైర్యంతో ముందుకు సాగాలని సంగీతా జైట్లీకి ఆమె సూచించారు. ఈ సందర్భంగా జైట్లీకి సోనియా నివాళులు అర్పించారు.

Celebrities Tribute To Ex Union Minister Arun Jaitley

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జైట్లీకి ప్రముఖుల నివాళి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.