చేవెళ్ల మహిళ హత్య కేసు…సిసి ఫుటేజీల్లో లభ్యమైన ఆధారాలు

  హైదరాబాద్: చేవెళ్ల తంగిడిపల్లి బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మహిళ హత్య కేసులో సైబరాబాద్ పోలీసులు కొంతమేర పురోగతి సాధించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తంగిడిపల్లి బ్రిడ్జి వద్ద రెండు, ఎన్‌కేపల్లి వద్ద రెండు సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించారు. తంగిడిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ రోజు రాత్రి దావతుకు వెళ్లివస్తుంటే ఓ కారు ఆగిందని మొదటి క్లూ ఇవ్వడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. ఈ క్రమంలో […] The post చేవెళ్ల మహిళ హత్య కేసు… సిసి ఫుటేజీల్లో లభ్యమైన ఆధారాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: చేవెళ్ల తంగిడిపల్లి బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మహిళ హత్య కేసులో సైబరాబాద్ పోలీసులు కొంతమేర పురోగతి సాధించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తంగిడిపల్లి బ్రిడ్జి వద్ద రెండు, ఎన్‌కేపల్లి వద్ద రెండు సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించారు. తంగిడిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ రోజు రాత్రి దావతుకు వెళ్లివస్తుంటే ఓ కారు ఆగిందని మొదటి క్లూ ఇవ్వడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని, సమయాన్ని క్రోడీకరించుకుని విచారణ చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా 20 కిలో మీటర్ల చదరపు దూరాన్ని సంఘటన వెలుగు చూసిన పరిసర ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పట్టడంతో ఓ సిసి కెమెరాలో అనుమానించిన కారుపై డ్రైవ్ ఈజీ అని రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో అనుమానితుడు డ్రైవ్‌ఈజీ ద్వారా కారును సెల్ఫ్‌డ్రైవ్‌ తీసుకుని ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. డ్రైవ్‌ఈజీ సంస్థ దగ్గర కారును అద్దెకు తీసుకున్నప్పుడు పెట్టిన ధ్రువీకరణ పత్రాలు, ఫోన్‌నంబర్లను పరిశీలించి అనుమానితుడి పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

పేయింగ్ గెస్ట్: 
పోలీసులకు దొరికిన ప్రాథమిక ఆధారాల్లో మృతురాలు సిక్కిం నుంచి వచ్చి ముంబైలో కొద్ది రోజుల ఉందని, ఆపై హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో పేయింగ్‌గెస్టు గదిలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి ఇటీవల హైదరాబాద్ వచ్చి మహిళతో తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మహిళతో గొడవ పడి ఆ తర్వాత వాగ్వాదం పెరిగి అతను సదరు మహిళను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత మృతదేహాన్ని తరలించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సిక్కింలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి కారణాల ఏమైనా ఉన్నాయా ?, మృతదేహాన్ని తరలించేందుకు స్థానికులు ఎవరైనా సహకరించారా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

CCTV footage evidence in chevella woman murder

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చేవెళ్ల మహిళ హత్య కేసు… సిసి ఫుటేజీల్లో లభ్యమైన ఆధారాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: