రెవెన్యూ పదోన్నతులపై సిసిఎల్‌ఎ నివేదిక

CCLA Report

మన తెలంగాణ/హైదరాబాద్: రెవెన్యూ విభాగంలో పలుచోట్ల సిబ్బంది లేక ఉ న్నవారికి అదనపు బాధ్యతలు అప్పగించి పనిచే యిస్తున్నారు. తహసీల్దార్ పోస్టు నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వరకు ఇదే తంతు కొనసాగు తోందని రెవెన్యూ సంఘాల నాయకులు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి క్యాడర్‌లో అడ్‌హక్ ప్రమోషన్ కింద చాలామంది ఉద్యోగులు పదోన్న తులు పొందారు. ప్రమోషన్ పొందిన వారు రెవె న్యూ శాఖలో కాకుండా వేరే డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఆ తరువాత సీనియార్టీ జాబితాలో ఉ న్న ఉద్యోగులకు పదోన్నతులు లభించకపో వడం తో చాలామంది ఇబ్బందులు పడుతున్నా రు. ఇ ప్పటికే రెవెన్యూ సంఘాల నాయకులు ఈ విష యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, పైస్థాయి అధికారులు ప్ర భుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
కిందిస్థాయి ఉద్యోగికి పదోన్నతి కల్పించాలని…
ప్రతి డిపార్ట్‌మెంట్‌లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగి పనిచేస్తున్నారు. భూ సంబంధింత విషయాలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలను నిర్వహించడానికి రెవెన్యూ పోస్టును ఆయా డిపార్ట్‌మెంట్‌లు ప్రభుత్వ అనుమతితో తాత్కాలికంగా నియమించుకోవడంతో తహసీల్దార్ నుంచి పై క్యాడర్ ఉద్యోగులు పలు విభాగాల్లో పనిచేయడానికి వెళుతున్నారు. మరికొందరు ఉద్యోగులు మంత్రుల దగ్గర పనిచేస్తుండడంతో రెవెన్యూ విభాగంలో ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన స్థానంలో కిందిస్థాయి ఉద్యోగికి పదోన్నతి కల్పించాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేరే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగి, రిక్రూట్‌మెంట్ అయ్యింది రెవెన్యూ శాఖ అయినా, జీతాలు మాత్రం వారు పనిచేసే డిపార్ట్‌మెంట్ చెల్లిస్తోందని, ఈ నేపథ్యంలో వేరే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారు ఎక్కువగా ఉండడంతో రెవెన్యూ విభాగంలో చాలా ఖాళీలు ఏర్పడుతున్నాయని రెవెన్యూ సంఘాలు పేర్కొంటున్నాయి.
వివిధ విభాగాల్లో పనిచేయాల్సి రావడంతో..
ఇదే విషయమై గతంలో ప్రభుత్వం సిసిఎల్‌ఏ నుంచి వివరాలు కోరగా ఉన్న ఉద్యోగుల సంఖ్య కంటే అదనంగా ఆయా పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారని సిసిఎల్‌ఏ అధికారులు నివేదిక ఇచ్చినట్టుగా రెవెన్యూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ సంఘాలు ఇచ్చిన వినతిని ప్రభుత్వం పక్కనబెట్టినట్టుగా తెలిసింది. రెవెన్యూ విభాగంలో పనిచేసే అధికారులు రాష్ట్ర స్థాయిలో ఏ డిపార్ట్‌మెంట్‌లోనైనా పనిచేయాల్సి ఉంటుందని, అందులో భాగంగానే చాలామంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. దీంతోపాటు గతంలో ఉన్న 10 జిల్లాలకు తోడుగా 23 జిల్లాలు అదనంగా ఏర్పడ్డాయని, గతంలో 459 మండలాలు ఉంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 589కి పెరిగిందని, 43 డివిజన్‌లకుగాను ప్రస్తుతం 71 డివిజన్‌లు ఏర్పడ్డాయని, ఈనేపథ్యంలో ఖాళీలు ఎక్కువగా ఏర్పడ్డాయని రెవెన్యూ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టుల వివరాలు
ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 31 పోస్టులకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, అడ్‌హక్ ప్రమోషన్ తీసుకున్న వారితో కలిపి మొత్తం 80 మంది పనిచేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో కలిపి డిఫ్యూటీ కలెక్టర్లు పోస్టులు 126 ఉండగా, 153 మంది పనిచేస్తున్నారు. తహసీల్దార్లు 873 పోస్టులకు గాను 889 మంది పనిచేస్తున్నారు. విఆర్‌ఓలు 7,039 పోస్టులకు గాను 6,000ల మంది పనిచేస్తుండగా, విఏఓ 24వేల పోస్టులకుగాను 22 వేల మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం విఆర్‌ఓ, విఏఓ పోస్టుల్లో ప్రభుత్వం అనుమతిచ్చిన దానికంటే తక్కువమం ది ఉద్యోగులు పనిచేస్తున్నారని సిపిఎల్‌ఏ అధికారులు పేర్కొంటున్నారు. అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న విఆర్‌ఓ, విఏఓ పోస్టులకు సంబంధించి వివరాల ను ఇవ్వాలని సంబంధిత కలెక్టర్లకు కోరినా ఇప్పటివరకు వారు స్పందించడం లేదని సిసిఎల్‌ఏ అధికారులు పేర్కొనడం కొసమెరుపు. జిల్లాల నుంచినివేదిక వస్తే విఆర్‌ఓ, విఏఓల రిక్రూట్‌మెంట్‌తో పాటు వారిలో ఎంతమందికి పదోన్నతులు దక్కాయి, ఎంతమంది అనర్హులన్న విష యం తేలుతుందని సిసిఎల్‌ఏ అధికారులు పేర్కొంటున్నారు.

CCLA Report on Revenue Promotions

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెవెన్యూ పదోన్నతులపై సిసిఎల్‌ఎ నివేదిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.