ఖమ్మంలో హోటల్‌పై కులవెలి

Hotel

ఓ కులం వారు నిర్వహించే హోటల్‌లో టీ తాగితే రూ.50వేలు జరిమానా
దండోరా వేయించిన కులపెద్దలు
పోలీసులకు బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు
కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు

మన తెలంగాణ/ఖమ్మం క్రైం : ఆ హోటల్నే వెలి వేసిన ఓ కుల పెద్దలు.. ఆ హోటల్‌లో ఎవ్వరూ టీ తాగిన రూ.50 వేలు జరిమానగా విధిస్తామని కుల పెద్దల దండోరా. చిన్నపాటి డబ్బుల గోడవ ఏకగా కులం నుంచి వెలివేసేంత వరకు వచ్చింది. ఖమ్మం నడిబొడ్డున త్రీటౌన్ ప్రాంతంలో మూడు బొమ్మల సెంటర్‌లో పరశురాములు అనే వ్యక్తి చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ హోటల్ సమీపంలో వడ్డెర కాలనీ ఉంది. గత నెల 13వ తేదీన హోటల్ వద్ద చిన్న గొడవ జరిగింది. దీంతో సదరు కాలనీ వారికి, హోటల్ నిర్వహకుని మధ్య వివాదం కొనసాగింది. జరిగిన సంఘటనపై హోటల్ నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీ పెద్దలు హోటల్ నిర్వాహకులకు రూ.2.5లక్షలు జరిమానా విధించారు. అంతేగాక తమ కులానికి చెందిన వారు ఆ హోటల్‌లో ఎవ్వరు టీ తాగినా, టిఫిన్ చేసినా రూ.50వేల జరిమానా అంటూ కులం పెద్దలతో తీర్మానించి ఆ కుటుంబాన్ని వెలి వేశారు. అంతేగాక ఈవిషయాన్ని ఆ ఏరియాలో దండోర వేయించారు.

అంతేగాక హోటల్ నిర్వహకులు నిర్మించుకుంటున్న ఇంటి పనులకు వడ్డెర మేస్త్రీలు, కూలీలు రాకుండా కుల పెద్దలు అడ్డుకున్నారు. దండోరా వేయించి స్థానికంగా ఈ విషయాన్ని ప్రచారం చేశారు. జరిగిన సంఘటనపై బాధితులు మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో హోటల్ నిర్వాహకుని కుమారుని పై రెండు రోజుల కిందట జరిగిన వినాయక నిమజ్జనం రోజున వడ్డెర కులం పెద్దలకు సంబంధించిన యువకులు దాడి చేశారు.ఈవిషయంపై వడ్డెర కుల పెద్దను విలేఖర్లు వివరణ కోరగా ‘మా కులం వారిని మాత్రమే ఆ హోటల్‌కు వెళ్లవద్దని అన్నామని ,ఎవ్వరైన దిక్కరించివెళ్లితే రూ.50వేల జరమాన విధిస్తామని దండోర వేయించింది వాస్తవమేనని ఇతర కులం వారిని వెళ్లవద్దని తాము ఎక్కడ చేప్పలేదని బదులిచ్చారు.తరుచుగా తమ కుల కాలనీ వారు హోటల్‌కు వెళ్లటం అక్కడ గొడవలు జరగటం, పోలీసులు కేసులు కావటంతో ఈ విధంగా నియంత్రించేందుకు ఈ కట్టుబాటు చేశామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు సదరు కులపెద్ద. జరిగిన సంఘటనపై నగర పోలీసులు రంగంలోకి దిగి శనివారం సంబంధిత కులంవారు నివాసం ఉండే కాలనీకి వేళ్ళి కౌన్సెలింగ్ నిర్వహించారు.
కుల కట్టుబాట్లపై కఠిన చర్యలు : పోలీసులు
కుల కట్టుబాట్లు, పంచాయతీల పేరుతో ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఖమ్మం వన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్ రమేశ్ హెచ్చరించారు. ఇటీవల మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో శనివారం వడ్డెర కాలనీ వాసులతో సమావేశమై పోలీసులు చేత వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరైనా వ్యాపారం నిర్వహించుకునే అవకాశం ఉందని, ఎవ్వరు కూడా అభ్యంతరాలు పెట్టడానికి వీలు లేదన్నారు. ఏదైనా సమస్య తలపెట్టినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, క్షణికావేశానికి లోనై పరస్పర దాడులు చేసుకొని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే రౌడీ షీట్ తెరుస్తామన్నారు. ఎవరూ కూడా భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్‌పెక్టర్ హెచ్చరించారు.

 caste elders expulsion of caste hotel in Khammam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఖమ్మంలో హోటల్‌పై కులవెలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.