మాజీ ఎంఎల్ఎ కుమారుడిపై కేసు నమోదు…

Ashish-Goud

హైదరాబాద్ : పటాన్ చెరువు మాజీ ఎంఎల్‌ఎ నందీశ్వరగౌడ్ కుమారుడు అశీష్‌గౌడ్ ఓ పబ్ మద్యం మత్తులో యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై కేసు నమోదైంది. హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్ ఉన్న పబ్‌లో శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అసభ్యంగా ప్రవర్తించిన ఆశీష్‌గౌడ్‌ను ప్రశ్నించిన యువతులపై భౌతికదాడులకు దిగాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అశీష్ గౌడ్‌పై తెలుగు రియాల్టీ షో బిగ్బాస్- 2 ఫేం సంజన మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సంజన ఫిర్యాదు మేరకు ఆశిష్ గౌడ్‌పై క్రైమ్ నెంబర్ 948/2019 కింద.. 354, 354 ఎ, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు ఆశీష్ గౌడ్ తమతో అసభ్యం ప్రవర్తించడమే కాకుండా, మద్యం బాటిళ్లతో దాడి చేసి…మొదటి అంతస్తు నుంచి తోసివేసే ప్రయత్నం చేశారంటూ బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ సంజన ఆదివారం మాదాపూర్ పోలీసుల ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆశీష్ గౌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆశీష్ గౌడ్ గతంలో ఓ క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యాడని, అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయని త్వరలోనే అశీష్‌ను స్టేషన్ పిలిపించి విచారిస్తారని పోలీసులు పేర్కొంటున్నారు. మ్యూజిక్ ప్రోగ్రామ్లో తన చేయి తాకుతూ అశీష్ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించాడని ఫిర్యాదులో పేర్కొంది.

తన ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చి నోటికొచ్చిన బూతులు మాట్లాడారని సంజన ఫిర్యాదులో పేర్కొంది. వేధింపులకు పాల్పడినట్లు తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ ఖండించారు. నోవాటెల్ హోటల్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశీష్ గౌడ్ చెప్పారు.

Case registered against Ashish Goud

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాజీ ఎంఎల్ఎ కుమారుడిపై కేసు నమోదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.