పివి ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు బోల్తా…

Car Accident in PV Expressway in Rajendra Nagar

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రోడ్డుప్రమాదం సంభవించింది. పివి ఎక్స్‌ప్రెస్‌ వే బ్రిడ్జ్ పై ఓ కారు అదుపుతప్పిన బోల్తా పడింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్‌ వైపు ప్రయాణిస్తున్న కారు పిల్లర్‌ నంబర్‌ 170 వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ హర్షకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్‌ పోలీసులు క్రేన్‌ సాయంతో కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పివి ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు బోల్తా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.