కెనరా బ్యాంక్‌లో 800 పిఒ పోస్టులు

Canara Bank PO 2018

ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంకు కెన‌రా బ్యాంక్ 800 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ (పిఒ) పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆన్‌లైన్ ప‌రీక్షతో పాటు గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్-బెంగ‌ళూరు లేదా ఎన్ఐటిటిఇ యూనివ‌ర్సిటీ- నోయిడాలో ఏడాది వ్యవ‌ధి గల పిజి డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ & ఫైనాన్స్‌ (పిజిడిఎఫ్‌) కోర్సు ఉంటుంది. విజ‌య‌వంతంగా కోర్సును పూర్తిచేసుకున్నవారిని ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పిఒ)/ అసిస్టెంట్ మేనేజ‌ర్ హోదాతో కెన‌రా బ్యాంక్‌లో పోస్టింగ్ ఇస్తారు.

 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌: 800 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్-404, ఓబీసీ-216, ఎస్సీ-120, ఎస్టీ-60.
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.708; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.118 (ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే)
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష విధానం..
* మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
* ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నప‌త్రం ఉంటుంది. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు.
* ప‌రీక్షలో సెక్షన్లవారీగా క‌టాఫ్‌ మార్కులు ఉంటాయి. రుణాత్మక మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి త‌ప్పు 1/4 మార్కులు కట్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 23.10.2018.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేది: 13.11.2018.
ఫీజు చెల్లింపు తేదీలు: 23.10.2018 – 13.11.2018
కాల్ లెటర్ డౌన్‌లోడ్: 05.12.2018
ఆన్‌లైన్ పరీక్ష తేది: 23.12.2018