మమ్మల్ని అవమానించారు

   ప్రేమతోనే వారిని గెలుస్తాను  వర్షం కురిస్తే విమానాలు రాడార్ నుంచి అదృశ్యమవుతాయా?  మోడీపై రాహుల్ చిర్రుబుర్రు ఉజ్జయిని: తన తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరాగాంధీలపై ప్రధాని నరేంద్ర మోడీ అవమానకరమైన వ్యాఖ్య లు చేస్తుండంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, నీముచ్‌లలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ తన తండ్రి, నాయనమ్మ, చివరికి ముత్తాతను కూడా అవమానించారని, అయితే తాను మాత్రం […] The post మమ్మల్ని అవమానించారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 ప్రేమతోనే వారిని గెలుస్తాను
 వర్షం కురిస్తే విమానాలు రాడార్ నుంచి అదృశ్యమవుతాయా?
 మోడీపై రాహుల్ చిర్రుబుర్రు

ఉజ్జయిని: తన తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరాగాంధీలపై ప్రధాని నరేంద్ర మోడీ అవమానకరమైన వ్యాఖ్య లు చేస్తుండంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, నీముచ్‌లలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ తన తండ్రి, నాయనమ్మ, చివరికి ముత్తాతను కూడా అవమానించారని, అయితే తాను మాత్రం మోడీ తల్లిదండ్రులను అవమానించాల్సి వస్తే ఆ పని చేయడంకన్నా చనిపోవడానికే మొగ్గు చూపుతానని స్పష్టం చేశారు. తాము ప్రేమతోనే రాజకీయాలు చేస్తామని అన్నారు.‘మోడీజీ ద్వేషంతో మాట్లాడుతారు. ఆయన మా నాన్నను, నాయనమ్మను, చివరికి మా ముత్తాతను కూడా అవమానించారు. అయితే నేను మాత్రం నా జీవితంలో ఎప్పుడు కూడా ఆయన కుటుంబం గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ అవమానకరంగా మాట్లాడను. అంతకన్నా చావడానికే ఇష్టపడతాను’ అని రాహుల్ అన్నారు. ద్వేషాన్ని వెదజల్లడానికి తాను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి రాలేదని, వారిని హత్తుకోవడం ద్వారా వారితో మాట్లాడుతానని, లోక్‌సభ ఎన్నికల్లో మోడీని ప్రేమతోనే మట్టికరిపిస్తామని అన్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మోడీ తనకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమని చెప్పిన విషయాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ, మోడీజీ అసలు సమస్యలను పక్కన పెట్టి మామిడి పండ్లు, మేఘాలు లాంటి వాటి గురించి మాట్లాడుతారంటూ ఎద్దేవా చేశారు. ‘మోడీజీ మీరు మామిడి పండ్లు ఎలా తినాలో చెబుతారు కానీ, నిరుద్యోగ యువతకు ఏం చేశారో మాత్రం దేశ ప్రజలకు చెప్పరు. నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి నిర్ణయాల వల్ల రాత్రికి రాత్రే వేలాది మంది యువకులు ఉద్యోగాలను కోల్పోయారు, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది’ అని విమర్శించారు. బాలాకోట్ దాడుల్లో మేఘాలు కముకోవడం వల్ల మన యుద్ధ విమానాలు పాక్ రాడార్‌కు చిక్కలేదంటూ మరో ఇంటర్వూలో మోడీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘మన దేశంలో ఎప్పుడైనా వర్షం కురిసినప్పుడు అన్ని విమానాలు రాడార్‌నుంచి అదృశ్యమవుతాయా?’ అని ప్రశ్నించారు.

Can radars detect aircraft during rain?: Rahul gandhi

The post మమ్మల్ని అవమానించారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: