వివిప్యాట్లను మొదట లెక్కించలేం : ఇసి

Election Commissionఢిల్లీ : ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండబోదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. వివిప్యాట్లను మొదట లెక్కించడం సాధ్యమయ్యే పని కాదని ఇసి పేర్కొంది. తొలుత ఐదు వివిప్యాట్లను లెక్కించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను ఇసి తోసిపుచ్చింది. ముందు అనుకున్న విధంగానే ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఇసి వెల్లడించింది. ఓట్ల లెక్కింపులో భాగంగా  వివిప్యాట్లను మొదట లెక్కించాలని, ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా నియోజకవర్గంలోని మొత్తం వివిప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం 22 ప్రతిపక్షాలకు చెందిన నేతలు    ఇసిని కలిసి ఈ మేరకు విన్నవించిన విషయం విదితమే. దీనిపై బుధవారం ఇసి స్పందించి , ప్రతిపక్షాల డిమాండ్ ను తిరస్కరించింది. దీంతో మొదట అనుకున్న ప్రకారమే ఓట్ల లెక్కింపు చేస్తామని ఇసి స్పష్టం చేసింది.

Can Not Be Calculated VV Pats First : EC

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వివిప్యాట్లను మొదట లెక్కించలేం : ఇసి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.