మూడో విడత పరిషత్ పోలింగ్‌కు ముగిసిన ప్రచారం

  రేపు మూడో విడత ఎన్నికలు ఏకగ్రీవాల్లో సత్తా చాటిన టిఆర్‌ఎస్ మన తెలంగాణ/హైదరాబాద్: జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు ఆదివారంతో ప్రచారం పరిసమాప్తమైంది. గత నెల 20వ తేదీన స్థానిక షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు 22 రోజులు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు హోరాహోరిగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ఎక్కడి మైకులు అక్కడ మూగబోయాయి. స్థానికంగా బలంగా ఉంటేనే రాష్ట్రస్థాయిలోనూ బలం ఉంటుందని టిఆర్‌ఎస్ అభ్యర్థులే […] The post మూడో విడత పరిషత్ పోలింగ్‌కు ముగిసిన ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రేపు మూడో విడత ఎన్నికలు
ఏకగ్రీవాల్లో సత్తా చాటిన టిఆర్‌ఎస్

మన తెలంగాణ/హైదరాబాద్: జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు ఆదివారంతో ప్రచారం పరిసమాప్తమైంది. గత నెల 20వ తేదీన స్థానిక షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు 22 రోజులు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు హోరాహోరిగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ఎక్కడి మైకులు అక్కడ మూగబోయాయి. స్థానికంగా బలంగా ఉంటేనే రాష్ట్రస్థాయిలోనూ బలం ఉంటుందని టిఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచేలా అందరూ పనిచేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. దీంతో టిఆర్‌ఎస్ తరపున ఆయా నియోజకవర్గాల ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానికంగా ఉన్న రాష్ట్రస్థాయి నేతలు ప్రచారం చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాల్లో కూడా టిఆర్‌ఎస్సే పై చేయి సాధించింది. మొదటి విడత, రెండో విడత కలిపి 129 ఎంపిటిసిలు, మూడు జడ్‌పిటిసిలు కైవసం చేసుకుంది. పోటీ ఉన్న స్థానాల్లోనూ దాదాపు టిఆర్‌ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

మూడో విడతల ఎన్నికలను ఈ నెల 14న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడో విడతలో 27 జిల్లాల్లోని 161 జెడ్‌పిటిసిలు, 1738 ఎంపిటిసిలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇందులో 30 ఎంపిటిసిలు ఏకగ్రీవమైనట్లు తెలిసింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. వీటికి మినహా అన్నింటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. 161 జెడ్‌పిటిసిలకు 741 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 138 ఎంపిటిసి స్థానాలకు 5726 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే మొదటి విడతలో వాయిదా పడిన, ఎంపిటిసిలకు కూడా మూడో విడతలోనే పోలింగ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

మొదటి విడత ఎన్నికలు ఈ నెల 6వ తేదీన, రెండో విడత ఎన్నికలు ఈ నెల 10వ తేదీన ముగిసాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలోనే నగదు, మద్యం సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించిన తరువాత ఈ నెల 27వ తేదీన ఎంపిటిసి, జెడ్‌పిటిసి అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ఆ తరువాత గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన ఎంపిటిసి, జెడ్‌పిటిసి స్థానాల బ్యాలెట్ బాక్సులను భద్రంగా స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. అక్కడ పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Campaign ended to third phase parishad polling

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడో విడత పరిషత్ పోలింగ్‌కు ముగిసిన ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: