రష్యా క్షిపణి కొంటే తీవ్ర పరిణామాలు

  ఆంక్షలు విధించే అవకాశం ఇండియాకు అమెరికా హెచ్చరిక వాషింగ్టన్: రష్యా నుంచి సుదూర లక్ష్యాలను ఛేదించగల ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థల్ని కొనుగోలు చేయాలనే నిర్ణయంతో ఇండియా ముందుకు సాగితే అది ఇండో యుఎస్ రక్షణ సంబంధాల్లో తీవ్ర పరిణామాలకు దారితీయగలదని ట్రంప్ పాలనాయంత్రాంగం హెచ్చరించింది. ఎస్ 400 రకం క్షిపణి రష్యా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపరితలం నుంచి ఆకాశంలోని సుదూర లక్ష్యాలను మట్టుబెట్టేందుకు రూపొందించిన రక్షణ వ్యవస్థ. ఎంతో ప్రమాదకరమైన […] The post రష్యా క్షిపణి కొంటే తీవ్ర పరిణామాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆంక్షలు విధించే అవకాశం
ఇండియాకు అమెరికా హెచ్చరిక

వాషింగ్టన్: రష్యా నుంచి సుదూర లక్ష్యాలను ఛేదించగల ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థల్ని కొనుగోలు చేయాలనే నిర్ణయంతో ఇండియా ముందుకు సాగితే అది ఇండో యుఎస్ రక్షణ సంబంధాల్లో తీవ్ర పరిణామాలకు దారితీయగలదని ట్రంప్ పాలనాయంత్రాంగం హెచ్చరించింది. ఎస్ 400 రకం క్షిపణి రష్యా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపరితలం నుంచి ఆకాశంలోని సుదూర లక్ష్యాలను మట్టుబెట్టేందుకు రూపొందించిన రక్షణ వ్యవస్థ. ఎంతో ప్రమాదకరమైన ఈ తరహా క్షిపణిని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం కొనే ఒప్పందం కింద 2014లో చైనా రష్యా నుంచి సమకూర్చుకుంది. అలా కొన్న మొదటి విదేశం చైనానే. గత ఏడాది అక్టోబర్‌లో 5 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఎస్400 వైమానిక రక్షణ వ్యవస్థ ఒప్పందంపై ఇండియారష్యా సంతకం చేశాయి. ‘రష్యా నుంచి ఎస్ 400 వైమానిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలన్న ఇండియా నిర్ణయం ముఖ్యమైందే. ఎన్నదగిందే.

కానీ అదేదో చిన్న ఒప్పందం అనడాన్ని మేము అంగీకరించం’ అని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అమెరికా నుంచి సైనిక కొనుగోళ్లు పెరుగుతున్నంత కాలం ఆ ప్రభావం ఇండియా అమెరికా సంబంధాలపై పడదన్న వాదనతో అమెరికన్ అధికారి ఏకీభవించలేదు. రష్యా నుంచి ఎస్ 400 రకం రక్షణ క్షిపణి వ్యవస్థను కొనే ఒప్పందంవల్ల అమెరికా ఇండియాపై ఆంక్షలు విధించవచ్చు.రష్యా నుంచి ఎస్ 400 క్షిపణిని కొనుగోలు చేస్తే … రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై అమెరికా కాంగ్రెస్ నెలకొల్పిన ఆంక్షల ద్వారా అమెరికా ప్రతికూలతలను ఎదుర్కొనే చట్టం (సిఎఎటిఎస్‌ఎ)కింద ఇండియాపై అమెరికా ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది.

Buying of S-400 from Russia will have serious implications

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రష్యా క్షిపణి కొంటే తీవ్ర పరిణామాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: