ఆ ఫోన్ కొంటే టివి ఫ్రీ…

 LG Smartphone

 

హైదరాబాద్ : ఎల్‌జి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి ఎల్‌జి సంస్థ కళ్లు చెదిరే ఆఫర్ ను ప్రకటించింది. ఆ కంపెనీకి చెందిన జి8ఎక్స్‌ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను రూ.49,999 ధ‌ర‌కు కొనుగోలు చేస్తే ఎల్‌జి ఎల్‌ఈడి టివిని ఉచితంగా పొందవచ్చు. ఆ ఫోన్‌కు ఎల్‌జి తన కంపెనీకి చెందిన 24 ఇంచుల ఎల్‌ఈడి టివిని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ ఆఫర్‌ జనవరి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఎల్‌జి తెలిపింది. ఎల్‌జి జి8ఎక్స్‌ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు అమెజాన్‌లో లేదా ఆఫ్‌లైన్‌ స్టోర్‌లో కొనుగోలు చేశాక జనవరి 15వ తేదీ లోపు ఎల్‌జి వెబ్‌సైట్‌లో తమ పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌, దాని ఐఎంఈఐ నంబర్‌, సీరియల్‌ నంబర్‌ తదితర వివరాలతోపాటు అడ్రస్‌ ప్రూఫ్‌ను జతచేసి ఫాంను నింపాలి. అంతే.. వినియోగదారులకు ఎల్‌ఈడి టివి తమ ఇంటికే ఉచితంగా డెలివరీ అవుతుంది. కాగా జి8ఎక్స్‌ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి వన్‌ టైం ఫ్రీ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. ఇక ఎల్‌జి ఈ ఫోన్‌ కొనుగోలుపై ఉచితంగా అందిస్తున్న టివి ఖరీదు రూ.10,990గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి ఉచితంగా టివిని పొందండి.

Buy LG Smartphone get TV Free

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆ ఫోన్ కొంటే టివి ఫ్రీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.