కిచెన్ టూల్స్

  ఎప్పటికప్పుడు వంటింట్లో వాడుకునేందుకు కొత్తకొత్త వస్తువులు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వాటితో వంట చేయడం మరింత సులభం అవుతోంది. మనక్కావల్సినవి ఎంచుకుని ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు. భద్రపరచడానికి… వంట చేయడం సులభమే కానీ మిగిలిపోయిన కూరగాయలు, ఉల్లిపాయల్లాంటివి ఎక్కడ భద్రపరచాలో తెలియక చాలామంది సతమతమౌతుంటారు. సగం కోసిన నిమ్మకాయల్లాంటివి అలాగే వదిలేస్తే ఊగలు, దోమలు, బిద్దింకల్లాంటివి ఊరుకుంటాయా… అందుకనే అలా మిగిలిపోయినవాటిని దాచిపెట్టేందుకు ఆన్‌లైన్‌లో ఇలాంటి డబ్బాలు, మూతల్లాంటివి దొరుకుతున్నాయి. నూనె చిందకుండా.. వడలు, గారెలు చేసుకునేటప్పుడు […]

 

ఎప్పటికప్పుడు వంటింట్లో వాడుకునేందుకు కొత్తకొత్త వస్తువులు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వాటితో వంట చేయడం మరింత సులభం అవుతోంది. మనక్కావల్సినవి ఎంచుకుని ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు.

భద్రపరచడానికి…

వంట చేయడం సులభమే కానీ మిగిలిపోయిన కూరగాయలు, ఉల్లిపాయల్లాంటివి ఎక్కడ భద్రపరచాలో తెలియక చాలామంది సతమతమౌతుంటారు. సగం కోసిన నిమ్మకాయల్లాంటివి అలాగే వదిలేస్తే ఊగలు, దోమలు, బిద్దింకల్లాంటివి ఊరుకుంటాయా… అందుకనే అలా మిగిలిపోయినవాటిని దాచిపెట్టేందుకు ఆన్‌లైన్‌లో ఇలాంటి డబ్బాలు, మూతల్లాంటివి దొరుకుతున్నాయి.

నూనె చిందకుండా..

వడలు, గారెలు చేసుకునేటప్పుడు నూనె చిందటం సహజం. అలాంటప్పుడు స్టవ్ దగ్గర గోడ జిడ్డుగా మారుతుంది. శుభ్రం చేసుకోవడానికి తంటాలు పడాలి. ఒక్కోసారి నూనె మీద తుళ్లిపడినా పడొచ్చు. అలా కాకుండా పాన్‌చుట్టూ నూనె చిందకుండా ఉండేందుకు ఫ్రైవాల్‌ను వాడుకోవచ్చు. సిలికాన్‌తో చేసిన ఈ వంటింటి పరికరం వేడికి తట్టుకుని పాన్ చుట్టూ అమర్చుకోవడానికి వీలుగా ఉంటుంది.

Buy Kitchen Tools Online at Best Prices

 

Related Images:

[See image gallery at manatelangana.news]