సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుక..

కీటకాలకు గాని అందాల పోటీలు పెట్టామంటే ఘన విజయం సీతాకోకచిలుకలకే. అందంగా మన చుట్టూ ఎగురుతూ, అందకుండా మనల్ని ఆటపట్టిస్తూ ఉండే సీతాకోకచిలుకలు క్రమక్రమంగా తగిపోతున్నాయి, వాటి ఉనికి ప్రశ్నార్ధకం అవుతోంది. కారణం ఏమిటా అని చూస్తే, అన్నీ మానవజన్యమైనవే. మనం వాడే కీటక నాశినులు సీతాకోకచిలుకల పైనా అధిక ప్రభావం చూపిస్తున్నాయి. ఈ అందాల సుందరి జీవితాన్ని, రాబో యే వాటి తరాలను కూడా కాలరాజేస్తు న్నాయి. ఇదే కాక మన నివాసాలకు ఇతర అవసరాలకు […] The post సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుక.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కీటకాలకు గాని అందాల పోటీలు పెట్టామంటే ఘన విజయం సీతాకోకచిలుకలకే. అందంగా మన చుట్టూ ఎగురుతూ, అందకుండా మనల్ని ఆటపట్టిస్తూ ఉండే సీతాకోకచిలుకలు క్రమక్రమంగా తగిపోతున్నాయి, వాటి ఉనికి ప్రశ్నార్ధకం అవుతోంది. కారణం ఏమిటా అని చూస్తే, అన్నీ మానవజన్యమైనవే. మనం వాడే కీటక నాశినులు సీతాకోకచిలుకల పైనా అధిక ప్రభావం చూపిస్తున్నాయి. ఈ అందాల సుందరి జీవితాన్ని, రాబో యే వాటి తరాలను కూడా కాలరాజేస్తు న్నాయి. ఇదే కాక మన నివాసాలకు ఇతర అవసరాలకు విచక్షణ లేకుండా అటవి ప్రాంతాలను, గడ్డి భూములను వాడేస్తున్నాం. పర్య వసారంగా వాటి నివాస నష్టం జరుగు తోంది. వీటికి తోడు మనం నిరంతరాయంగా కలిగించే వాయుకాలు ష్యం వల్ల సీతాకోకచిలుకల సంఖ్య భారీగా తగ్గిపోయింది.

ఐతే ఏంటి?

పరాగ సంపర్కం గణనీయంగా తగ్గిపోతోంది. దీని వల్ల ఫలదీకరణ, వాటి నుంచి గింజల రాబడి తగ్గి, తరువాతి తరం మొక్కలు లేకుండా పోతున్నాయి. ఇది ఇలాగే కనుక కొనసాగితే మనకు చూడడానికి సీతాకోకచిలుకలే కాదు తినడానికి తిండి గింజలు కూడ దొరకవు.

ఆహారపు గొలుసులో సీతాకోకచిలుక పాత్ర పరాగసంపర్క కారకంగాను, బల్లి, కప్ప వంటి జీవులకు ఆహారంగాను ఎంతో ముఖ్యమైనది. ఒక్క సీతాకోకచిలుక, మరి అటువంటి పరాగసంపర్క కారకాల పాత్ర కాని కనుమరుగు అయ్యిందా పర్యవరణ వ్యవస్థ పతనం ఖాయం. మనం అదే దిశగా దూసుకెళ్తున్నాం.

సీతాకోకచిలుక జీవిత చక్రం 4 దశలలో ఉంటుంది. గుడ్దు, గొంగళి పురుగు, గూడు, సీతాకోకచిలుక.తల్లి సీతాకోకచిలుక కేవలం కొన్ని మొక్కలపైన మాత్రమే గుడ్లు పెడుతుంది. ఏవైతే తన పిల్లలు తిని ఎదగగలవో. వాటిని మనం లార్వల్ హోస్ట్ ప్లాంట్స్ అంటాం. ఉదా: కరివేప, గన్నేరు, నిమ్మజాతి మొక్కలు, గుబ్బతడ వంటివి. గుడ్డు పగిలి గొంగళి బయటకు వచ్చి ఆకులను, పువ్వులను తినేస్తూ చకచకా పెరుగుతుంది. ఈ పెరుగుదలలో అది విసర్జించిన పదార్థం మొక్కల ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుంది.

ఇలా కొన్ని రోజులు గడిచాక గూడు తయారు చేసుకుని అందులోకి వెళ్లిపోతుంది. ఇక్కడ పూర్ణపరివర్తన జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత, బయట వేడి సమపాళ్లలో ఉన్నప్పుడు, గూడు పగిలి అందాల సీతాకోకచిలుక బయటకు వస్తుంది. కొద్దిసేపు రెక్కలను ఎండబెట్టుకుని, హీమొలింఫ్ అనబడే రక్తంవంటి పదార్థం రెక్కల్లోకి దూసుకెళ్లగా తన మొదటి వాయుగమనం మొదలుపెడుతుంది. తన రెక్కల అందంతో మనకి కనువిందు చేస్తూ ఎగిరిపోతుంది.

మనం ఏమి చేద్దాం?

స్థానిక మొక్కలను పెంచుకుందాం. గొంగళీలను చంపకుండా చూద్దాం. మన ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పాఠశాలల్లో సీతాకోకచిలుక వనాలను అభివృద్ధి చేసుకుందాం. ఇది అత్యంత సులువైన పని ఎందుకంటే అన్నీ స్థానిక మొక్కలే కాబట్టి చక్కగా బతకగలవు. సీతాకోకచిలుకని కాపాడుకుందాం.. మన భవిష్యత్తును మనమే జాగ్రత్త చేసుకుందాం…

Butterfly Telugu Story
                           

  రాధిక చింతలపాటి   హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, గ్లెండేల్ అకాడమి,హైదరాబాద్

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుక.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.