అనిల్ కంపెనీల నుంచి వైదొలగిన ఆడిటర్లు

Anil Ambani

 

ముంబయి: అనిల్ అంబానీకి ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి. ఆయన నేతృత్వంలోని రెండు కంపెనీలకు చెందిన చట్లబద్ధ ఆడిటర్లు వైదొలిగారు. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా సంస్థలు వీటిలో ఉన్నాయి.దీంతో గత మూడు నెలల్లో ఆడిటర్లు వైదొలగిన అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన కంపెనీల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ విషయాన్ని ఆర్ ఇన్‌ఫ్రా శుక్రవారం స్టాక్ ఎక్స్‌చేంజికి తెలియజేసింది.‘ కంపెనీకి ఉన్న చట్టబద్ధ ఆడిటర్లలో ఒకరైన బిఎస్‌ఆర్ అండ్‌కో ఎల్‌ఎల్‌పి 9వ తేదీనుంచి వైదొలిగింది’ అని తెలిపింది. ఆర్ పవర్‌నుంచి కూడా ఇలాంటి సమాచారమే స్టాక్ ఎక్స్‌చేంజికి వచ్చింది.గత జూన్ 14న ఆర్‌ఇన్‌ఫ్రా ఆడిట్ నివేదికలో ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లపై ఆందోళన వ్యక్తం చేసింది.తమకు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం అందడం లేదని పేర్కొంది.

BSR resigns as RPower, RInfra statutory auditor

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అనిల్ కంపెనీల నుంచి వైదొలగిన ఆడిటర్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.