గుడికెళ్లే నేత‌ల‌ను నిషేధించండి: మాయావ‌తి

ఉత్తరప్రదేశ్: ఎన్నిక‌ల వేళ దేవాల‌యాల‌కు వెళ్లే నేత‌ల‌పై నిషేధం విధించాల‌ని బీఎస్పీ చీఫ్ మాయావ‌తి ఇసిని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులను ఆల‌యాల‌కు వెళ్ల‌కుండా అడ్డుకోవాలంటూ మంగళవారం ఆమె ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు. నేతలు ఆల‌యాల‌కు వెళ్ల‌డం ఎన్నిక‌ల నియ‌మావ‌ళి కింద‌కు వ‌స్తుంద‌ని మాయావతి తీవ్రంగా ఆరోపించారు. లక్నోలో మాయావ‌తి మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రోడ్‌షోలు నిర్వ‌హించ‌డం, గుడికి వెళ్ల‌డం ఫ్యాష‌న్‌గా మారింద‌ని ఆమె ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి వాటి […] The post గుడికెళ్లే నేత‌ల‌ను నిషేధించండి: మాయావ‌తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఉత్తరప్రదేశ్: ఎన్నిక‌ల వేళ దేవాల‌యాల‌కు వెళ్లే నేత‌ల‌పై నిషేధం విధించాల‌ని బీఎస్పీ చీఫ్ మాయావ‌తి ఇసిని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులను ఆల‌యాల‌కు వెళ్ల‌కుండా అడ్డుకోవాలంటూ మంగళవారం ఆమె ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు. నేతలు ఆల‌యాల‌కు వెళ్ల‌డం ఎన్నిక‌ల నియ‌మావ‌ళి కింద‌కు వ‌స్తుంద‌ని మాయావతి తీవ్రంగా ఆరోపించారు. లక్నోలో మాయావ‌తి మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రోడ్‌షోలు నిర్వ‌హించ‌డం, గుడికి వెళ్ల‌డం ఫ్యాష‌న్‌గా మారింద‌ని ఆమె ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి వాటి కోసం అయ్యే ప్ర‌చార ఖ‌ర్చుపై ఇసి దృష్టిపెట్టాల‌న్నారు. ఆ మొత్తాన్ని అభ్య‌ర్థి ప్ర‌చార ఖ‌ర్చు ఖాతాల్లోనే వేయాల‌న్న మాయావతి… రోడ్‌షోల‌ను, ఆల‌యాల సంద‌ర్శ‌న‌ను మీడియా క‌వ‌రేజ్ చేయ‌డం ఆపేయాల‌ని కూడా సూచించారు.

BSP Chief Mayawati seeks ban on temple visits

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గుడికెళ్లే నేత‌ల‌ను నిషేధించండి: మాయావ‌తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: