ఐటి దెబ్బతో మార్కెట్లు కుదేలు

Sensex
216 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబై: వరుసగా రెండో రోజు వారాంతం శుక్రవారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐటీ రంగ షేర్ల భారీ పతనం, సూచీల గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వల్ల ప్రతికూల ప్రభావం ఏర్పడింది. అలాగే ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమీ కో అపరేషన్ అండ్ డెవెలప్‌మెంట్(ఒఇసిడి) సంస్థ ఈ ఏడాదికి దేశీయ ఆర్థిక వృద్ధి దృక్పథాన్ని 5.8 శాతానికి డౌన్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. దీంతో నిఫ్టీ 54పాయింట్లు నష్టంతో 11,914.40 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 216 పాయింట్లు కోల్పోయి 40359.41 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడేలో సెన్సెక్స్ 279 పాయింట్లు నష్టపోయి 40,295.17 వద కనిష్టాన్ని నమోదు చేసింది. ఐటి, ప్రైవేట్ బ్యాంక్, ఆర్థిక, ఎఫ్‌ఎంసిజి షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ గోల్డ్‌న్ సాచ్స్ ఐటీ రంగంపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో ఈ రంగ షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూసాయి. ఇన్ఫోసిస్, టిసిఎస్ వంటి హెవీ వెయిట్ షేర్లు భారీగా పతనం కావడం మార్కెట్ సూచీలపై ప్రభావం చూపింది.

మరోవైపు నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు రాణించగా, అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా జరుగుతుండటంతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే ఆటో, మీడియా, రియల్టీ రంగ షేర్లు పెరిగాయి. ఇక వారం మొత్తంగా నిప్టీ ఇండెక్స్ 21 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్ మాత్రం 2 పాయింట్లు మాత్రమే పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఏసియన్ పేయింట్స్, టిసిఎస్, యూపీఎస్‌ల్ షేర్లు నష్టపోయాయి.

 

BSE Sensex lost 216 points

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐటి దెబ్బతో మార్కెట్లు కుదేలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.