నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య…

Murder

 

నల్లగొండ : వ్యక్తిగత వివాదం కారణంగా వ్యక్తి హత్యకు గురైన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రం దేవరకొండ రోడ్డులో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన సుభాష్‌బోస్(35), నల్లగొండకు చెందిన శంకర్‌రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని శ్రీనివాస వైన్స్‌తో పాటు నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో గల శివబాలాజీ వైన్స్‌లో గత కొంతకాలంగా పనిచేస్తున్నా రు.

ఈ రెండు మద్యం దుకాణాలు ఒకే వ్యక్తికి చెందినవి కావడంతో సుభాష్‌బోష్ కొన్నిరోజులు తిప్పర్తిలో, కొన్ని రోజులు నల్లగొండలో పనిచేస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది. గడిచిన నెలరోజులుగా సుభాస్ నల్లగొండలోని శివబాలాజీ వైన్స్‌లో పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి దేవరకొండ రోడ్డులోని వైన్స్‌లో పనిచేసే శంకర్‌రెడ్డితో కలిసి వైన్స్ మూసివేసిన తర్వాత వెనుకభాగంలో గల స్మశానవాటికలో ఇద్దరే మద్యం సేవించారు. అప్పుడు ఇద్దరి మద్య జరిగిన పెనుగలాటలో సుభాష్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

స్మశానవాటికలో శుక్రవారం ఉదయం సుభాష్‌బోస్ మృతదేహాన్ని గమనించిన చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇరువురి మధ్య ఆర్ధిక లావాదేవీలు, లేదంటే వ్యక్తిగత వైరుద్యాలు అనే పలురకాల కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతుడు సుభాష్ భార్య, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సహ ఉద్యోగి శంకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు, పరారీలో ఉన్న శంకర్‌రెడ్డి కోసం గాలింపు జరుపుతున్నట్లు వన్‌టౌన్ సిఐ సురేష్‌కుమార్ తెలిపారు.

Brutal Murder of Man in Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.