ఫార్మా రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

Pharma

 

ఇండియన్‌ ఫార్మాఅసోసియేషన్ ప్రెసిడెంట్ డా.టివినారాయణ
గురునానక్‌లో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అంతర్జాతీయసదస్సు

ఇబ్రహీంపట్నంరూరల్ : ఫార్మారంగంలో ప్రతిభను కనబరిచే విద్యార్థులకు ఉజ్వలభవిష్యత్తు లభిస్తుందని ఇండియన్‌ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.టివినారాయణ అన్నారు. శుక్రవారం మండలకేంద్రం సమీపంలోని గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్‌లో స్కూల్ ఆఫ్ ఫార్మా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌ను ఆయన ప్రారంభించారు. గురునానక్ పబ్లికేషన్స్‌లో ప్రచురితమైన జర్నల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫార్మాస్యూటికల్ రంగంలో జరుగుతున్న పరిశోధనలను వెలికితీయడమే లక్షంగా ఈసదస్సును నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈరంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు అధిక ప్రాధాన్యముంటుందని అన్నారు. విద్యాసంస్థలు విజ్ఞానాన్ని అన్వేషించి భద్రపరిచి భవిష్యత్‌తరాలకు అందిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ ఉత్పత్తిలో భారత్‌దేశం మూడోస్థానంలో నిలిచిందని అన్నారు. బల్క్‌డ్రగ్ ఉత్పత్తిలో హైదరాబాద్ దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని ఆయన తెలిపారు. నూతన ఆవిష్కరణలకు మనదేశంలో అశేషమైన మానవవనరులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఫార్మావిద్యార్థులు నిరంతర శ్రమతో జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. నేడు మానవులు ఎదుర్కొంటున్న కిడ్నీ, లివర్, కాన్సర్, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించే దిశగా ఫార్మారంగంలో పరిశోధనలు తోడ్పాటునందించాలని ఆయన ఆకాంక్షించారు.

విద్యార్థులు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ సేవలను ఆయన కొనియాడారు. ఈకార్యక్రమంలో యూనివర్సీటీ ఆఫ్ క్వాజుల్ నాటల్ ప్రొఫెసర్ శ్రీకాంత బి.జొన్నలగడ్డ, సిపిఎస్ ఐఎస్‌టి, జెఎన్‌టియూహెచ్ డా.సునీతారెడ్డి, ఫ్రొఫెసర్ దుబాయ్ ఫార్మసీ కాలేజ్ ఫర్ గర్ల్ డా.మీర్జా ఆర్.భేగ్, తెలంగాణ ఫార్మసీ కళాశాలల సంఘం అధ్యక్షులు డా.కె.రామదాస్, గురునానక్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌ఎస్ సైనీ, వైస్‌ఛైర్మన్ జిఎస్‌కోహ్లీ, డైరెక్టర్ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Bright Future for Students in the field of Pharma

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫార్మా రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.