పెళ్లి ఇంట్లో విషాదం.. వధువు తల్లి మృతి

మన తెలంగాణ/వరంగల్: రెండు రోజుల్లో పెళ్లి సందడి జరుగవలసిన ఇంట్లో చావుమేళం వినిపించడం పలువురుని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మినారాయణస్వామి ఆలయం వీధిలో సమ్మేట నీల(40) మంగళవారం పెళ్లి పనుల్లో బిజీగా ఉండి అలసిపోయి రాత్రి నీద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురి అయి మృతి చేందింది. ఆమెకు భర్త లోకయ్యగౌడ్, ఇద్దరు కుతురులు ఉన్నారు. […] The post పెళ్లి ఇంట్లో విషాదం.. వధువు తల్లి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/వరంగల్: రెండు రోజుల్లో పెళ్లి సందడి జరుగవలసిన ఇంట్లో చావుమేళం వినిపించడం పలువురుని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మినారాయణస్వామి ఆలయం వీధిలో సమ్మేట నీల(40) మంగళవారం పెళ్లి పనుల్లో బిజీగా ఉండి అలసిపోయి రాత్రి నీద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురి అయి మృతి చేందింది. ఆమెకు భర్త లోకయ్యగౌడ్, ఇద్దరు కుతురులు ఉన్నారు.

పెద్ద కుతురుకు ఈనెల 20న పెళ్లి జరుగవలసి ఉంది. పెళ్లికి రెండు రోజుల ముందు ఇంటి యాజమననరాలు పాము కాటుతో మృతి చేందడంతో గ్రామంలో విషాద చాయాలు అలుముకున్నాయి. గతంలో కూడా మృతిరాలు భర్త సమ్మేట లోకయ్యను పాము కాటు వేయడంతో ఆరు నెలల పాటు చికిత్స చేయించుకున్నాడు. మృతి రాలు భర్త రోదనలు సలువురిని కంటతడి పెట్టించాయి. ఎంపిపి బానోతు సుజాత మోతిలాల్, జడ్పీటీసీ గుగులోతు సుచిత్ర బాలునాయక్, జడ్పీ కొఆప్షన్ సభ్యులు ఎండి ఖాసీం, సర్పంచ్ నూనవత్ రమేష్ నాయక్, ఎంపిటీసీ నూకల రాధిక పలువురు ప్రముకులు మృతిరాలు భర్త లోకయ్యను ఓదర్చారు.

Bride’s Mother died after snake Bitten in Warangal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పెళ్లి ఇంట్లో విషాదం.. వధువు తల్లి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: