ప్రియురాలి కోసం నిప్పంటించుకున్న ప్రియుడు..

మహబూబ్ నగర్: ప్రేమ అంటే అగ్ని అని తెలుసు. అయినా మళ్లీ ముద్దెట్టుకున్నాను. ప్రేమంటే విషమని తెలుసు.అయినా మరో గుక్కెడు ప్రేమను అడిగాను. అన్న అమృతాప్రియతం అనే కవి వర్ణించాడు. ప్రేమ సామ్రాజ్యంలో నా ప్రతి తలుపు నీ కోసం.. నా ప్రతి అడుగు నీ నడక నీ కోసం.. నాలోని ప్రతి శ్వాస నీకోసం.. కమ్మని కళవై వచ్చి ముద్దుగా మురిపిస్తావు… రావా నా వెంట అంటూ నాలో ఆశలెన్నో లేపుతావు.. కళేనని తెలిసినా కంటికి […]

మహబూబ్ నగర్: ప్రేమ అంటే అగ్ని అని తెలుసు. అయినా మళ్లీ ముద్దెట్టుకున్నాను. ప్రేమంటే విషమని తెలుసు.అయినా మరో గుక్కెడు ప్రేమను అడిగాను. అన్న అమృతాప్రియతం అనే కవి వర్ణించాడు. ప్రేమ సామ్రాజ్యంలో నా ప్రతి తలుపు నీ కోసం.. నా ప్రతి అడుగు నీ నడక నీ కోసం.. నాలోని ప్రతి శ్వాస నీకోసం.. కమ్మని కళవై వచ్చి ముద్దుగా మురిపిస్తావు… రావా నా వెంట అంటూ నాలో ఆశలెన్నో లేపుతావు.. కళేనని తెలిసినా కంటికి కనిపించవు అంటూ ఓ ప్రేమికుడు తన ప్రియురాలు ఇక తనకు దక్కదనుకొని ఏకంగా ప్రియురాలి ఇంటి ముందే వంటిపై పెట్రోల్ పోసుకొని తన జీవితాన్ని ప్రేమకే అంకితం చేశాడు ఓ ప్రేమికుడు. తాను లేనిదే ఇక తన జీవితం దుర్లభమని భావించి తనువు చాలించాడు. తన ప్రేమకు ప్రియురాలు బంధువులు అడ్డుచెప్పడమే కాకుండా చంపుతామని బెదిరించడంతో అటు ప్రేమలోనూ, ఇటు మృత్యవుతో పోరాడి చివరికి మృతి చెందాడు. వివరాలోకి వేళ్తే… హైదరాబాద్‌కు చెందిన భాస్కర్, ఆలియాస్ చంటి, మిట్టు షాద్‌నగర్ ప్రాంతంలోని ఫార్మసి చదువుతూ.. ఇటీవలనే చదువు పూర్తి చేశారు. మహబూబ్‌నగర్ ఎనుగొండ గ్రామానికి చెందిన ఒక అమ్మాయి అదే షాద్‌నగర్ ప్రాంతంలోని అదే కళాశాలో బి.ఫార్మసి కళాశాలలో చదవుతుంది.

భాస్కర్‌కు జూనియర్‌గా ఉన్న ఈ అమ్మాయితో సాన్నిహిత్యంతో ఉంటూ ఇరువురు ప్రేమలో పడ్డారు. నాలుగు సంవత్సరాలు కలిసి తిరిగారు. భాష్కర్‌కు తండ్రి లేక పోవడంతో తల్లికి తన ప్రేమ వ్యవహారం చేప్పాడు. అందుకు ఆమె ఒప్పుకొవడంతో అమ్మాయి కూడా భాస్కర్ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేది. ఇటీవలనే భాస్కర్ తన చదువు ముగియడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. వీరిరువురి ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో భాష్కర్‌ను బెదిరింపులకు గురి చేశారు. వీరి ప్రేమకు కులం అడ్డు రావడంతో భాస్కర్‌ను అమ్మాయిని మరిచి పోవాలని అమ్మాయి బందువులు హెచ్చరించారు. అయినా భాస్కర్ వినకపోవడంతో అమ్మాయి బంధువు ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి భాష్కర్‌ను ఇటీవల తీవ్రంగా బెదిరించాడు. గత సోమవారం కూడా భాస్కర్ మహబూబ్ నగర్‌కు వచ్చి తన ప్రేమ గురించి అమ్మాయి బంధువులకు చెప్పిన వారు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భాస్కర్ గురువారం సాయంత్రం అమ్మాయి ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లు మంటలు ఆర్పి మహబూబ్ నగర్ ప్రభుత్వ సర్వజన వైద్య శాలలో చేర్పించారు. ఈ సందర్భంగా తనను బెదిరించిన విషయాన్ని ఆ ప్రజాప్రతినిధి పేరుతో పాటు తన మరణ వాంగూల్మంలో భాష్కర్ వివరించారు. భాస్కర్ గురువారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందాడు. మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: