పసివాడి ప్రాణం తీసిన పతంగ్

మహబూబ్‌నగర్:  జిల్లాలోని జడ్చర్ల మండలంలో పండుగపూట విషాదం నెలకొంది. గాలిపటం కోసం పసివాడి ప్రాణం బలైపోయింది. తండ్రి కళ్లముందే ఈ ఘటన జరగడం స్థానికంగా అందరినీ కలిచివేసింది. ఈ విషాద సంఘటన గౌరీశంకర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న గణేశ్ తన ఆరు సంవత్సరాల కొడుకు కార్తీక్‌తో కలిసి ఇంటిపై పతంగ్ ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో గాలిపటం పక్కింటి మేడపై చిక్కుకుంది. దీంతో దాన్ని తీసుకోవడానికి తండ్రి అక్కడకు వెళ్లాడు. చిక్కుకున్న గాలిపటాన్ని తీసి.. అక్కడి నుంచే […] The post పసివాడి ప్రాణం తీసిన పతంగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
మహబూబ్‌నగర్:  జిల్లాలోని జడ్చర్ల మండలంలో పండుగపూట విషాదం నెలకొంది. గాలిపటం కోసం పసివాడి ప్రాణం బలైపోయింది. తండ్రి కళ్లముందే ఈ ఘటన జరగడం స్థానికంగా అందరినీ కలిచివేసింది. ఈ విషాద సంఘటన గౌరీశంకర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న గణేశ్ తన ఆరు సంవత్సరాల కొడుకు కార్తీక్‌తో కలిసి ఇంటిపై పతంగ్ ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో గాలిపటం పక్కింటి మేడపై చిక్కుకుంది.
దీంతో దాన్ని తీసుకోవడానికి తండ్రి అక్కడకు వెళ్లాడు. చిక్కుకున్న గాలిపటాన్ని తీసి.. అక్కడి నుంచే ఎగురవేయగా ఇటువైపు భవనంపై ఉన్న కార్తీక్ దాన్ని ఎగిరేసే క్రమంలో వెనక్కి జరుగుతూ మేడపై నుంచి కింద పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కొడుకు కళ్లముందే మృతి చెందడటంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
boy slips from building while flying kite in jadcherla

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పసివాడి ప్రాణం తీసిన పతంగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: