తరుణ్‌కి హరీష్ బాసట

Boy-pedals-from-Muluguసమస్యను చెప్పుకునేందుకు ములుగు నుంచి నగరానికి సైకిల్ యాత్ర
యువకునికి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే హరీష్ రావు
రూ. పదివేల ఆర్థ్ధిక సహాయం

మన తెలంగాణ/హైదరాబాద్: తన అమ్మమ్మ భూమిని ఎవరో కబ్జా చేశారని పేర్కొంటూ 19 సంవత్సరాల తరుణ్ అనే యువకుడు శుక్రవారం మాజీ మంత్రి, సిద్దిపేట్ టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్‌రావుని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను చెప్పుకునేందుకు ఆయన వారం రోజుల క్రితం ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుంచి సైకిల్ యాత్ర ద్వారా హైదరాబాద్‌కు పయనం అయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావును కలిసి తాను ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. వెంకటాపూరంలో నివసిస్తున్న తన అమ్మమ్మ చామంతుల దుర్గమ్మ అనే భూమిని అదే ఊరుకు చెందిన కొంతమంది భూమిని కబ్జా చేశారని హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్ళారు.

దీనిపై తాను ఎన్నోసార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో మిమ్మల్ని కలవాలని వెంకటాపురం నుండి సైకిల్ యాత్ర చేపట్టినట్లు హరీష్‌రావుకు వివరించారు. మీరంటే తనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. అందుకే ములుగు నుంచి నగరానికి సైకిల్ యాత్ర ద్వారా రావాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో వెంటనే తమను ఆదుకోవాలని హరీష్‌రావుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై హరీష్‌రావు వెంటనే స్పందించి స్థానిక సిఐ, ఎమ్మార్వోలతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే తరుణ్‌కు న్యాయం చేయాలని సూచించారు.

తనను కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన తరుణ్‌ను హరీష్‌రావు అభినందించారు. తక్షణమే ఆయనకు తనవంతు సాయం కింద హరీష్‌రావు 10వేల రూపాయలు అందించారు. భవిష్యత్తులోనూ తాను అండగా ఉంటానని తరుణ్‌కు, హరీష్‌రావు మనోధైర్యాన్ని ఇచ్చారు. కాగా తనపట్ల హరీష్‌రావు చూపిన అభిమానాన్ని చూసి తరణ్ మరింతగా ఉప్పొంగిపోయారు.

 

Boy pedals from Mulugu to Hyderabad to meet Harish Rao

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తరుణ్‌కి హరీష్ బాసట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.