పిజ్జా కోసం పోలీసులకు ఆర్డరిచ్చిన బుడుతడు

అమెరికా : మాన్యుయెల్ బేషరా అనే ఐదేళ్ల బుడుతడికి బాగా ఆకలి వేసింది. వెంటనే తనకు పిజ్జా కావాలంటూ 911 కు ఫోన్ చేశాడు. ఈ నెంబర్ ఆపదలో ఉన్న వారి కోసం పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో కంగారుపడిన పోలీసులు ఆపదలో ఉన్న బాలుడు ఫోన్ చేశాడని భావించారు. తక్షణమే  వారు స్పందించారు. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. ఫ్లోరిడాలో తన తల్లిదండ్రులతో కలిసి బెషరా ఉంటున్నాడు. తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పుడు బెషరాతో పాటు అతడి […] The post పిజ్జా కోసం పోలీసులకు ఆర్డరిచ్చిన బుడుతడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమెరికా : మాన్యుయెల్ బేషరా అనే ఐదేళ్ల బుడుతడికి బాగా ఆకలి వేసింది. వెంటనే తనకు పిజ్జా కావాలంటూ 911 కు ఫోన్ చేశాడు. ఈ నెంబర్ ఆపదలో ఉన్న వారి కోసం పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో కంగారుపడిన పోలీసులు ఆపదలో ఉన్న బాలుడు ఫోన్ చేశాడని భావించారు. తక్షణమే  వారు స్పందించారు. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. ఫ్లోరిడాలో తన తల్లిదండ్రులతో కలిసి బెషరా ఉంటున్నాడు. తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పుడు బెషరాతో పాటు అతడి సోదరి ఇంట్లో ఉన్నారు. తనకు ఆకలి కావడంతో బెషరా 911కి డయల్ చేశాడు. తనకు ఆకలిగా ఉందని, పిజ్జా తేవాలని ఆర్డర్ ఇచ్చాడు. దీంతో పోలీసులు బెషరా ఇంటికి వచ్చారు. అతడికి పిజ్జా అందజేసి, 911కి ఎప్పుడు కాల్ చేయాలి, ఎందుకు కాల్ చేయాలనే విషయంపై బెషరా సోదరికి అవగాహన కలిపించారు. బేషరా అవగాహన లేక ఫోన్ చేశాడని, తమను క్షమించాలని అతడి సోదరి పోలీసులను కోరింది. తనకు పోలీసులు పిజ్జా ఇవ్వడంతో బెషరా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Boy Ordered To Police For Pizza At America

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పిజ్జా కోసం పోలీసులకు ఆర్డరిచ్చిన బుడుతడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: