బాలుడి ప్రాణం తీసిన వీడియో

Boy murder over deleting video in maharashtra

 

ముంబయి: 17 ఏళ్ల బాలుడు చీర కట్టుకొని డ్యాన్స్ చేసిన వీడియోను తొలగించాలని తన స్నేహితులకు చెప్పడంతో వారు అతడిని హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరం దారావిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కౌశిక్ సునీల్ నారాయణ్ కార్ అనే 17 ఏళ్లు యువకుడు సుభాష్ నగర్‌లో నివసిస్తున్నాడు. కౌశిక్ చీర కట్టుకొని డ్యాన్స్ చేశాడు. అతడు డ్యాన్స్ చేస్తుండగా నలుగురు స్నేహితులు వీడియో తీశాడు. ఈ వీడియో అడ్డం పెట్టుకొని కౌశిక్‌ను ఆ నలుగురు వేధించారు. ఆ వీడియోను తొలగించాలని వాళ్లను బతిమాలాడు. వాళ్లు వినకపోవడంతో తన ఇంటికి సమీపంలో ఉండే మామయ్యకు చెబుతానని వాళ్ల ఇంటికి వెళ్లాడు.  మామయ్య ఇంట్లో లేకపోవడంతో కౌశిక్ వెనుదిరిగాడు. మార్గం మధ్యలో స్నేహితులు అతడిని అడ్డగించి గొడవకు దిగారు. ముగ్గురు అతడిని గట్టిగా పట్టుకోగా నాలుగో వ్యక్తి కత్తితో రెండు సార్లు పొడిచాడు. స్థానికులు వెంటనే తీవ్రంగా గాయపడిన యువకుడిని షియాన్ ఆస్పత్రికి తరలించారు. రక్తం ఎక్కువగా పోవడంతో చికిత్స పొందుతూ కౌశిక్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని జువైనల్ హోమ్‌కు తరలించగా నాల్గో వ్యక్తిపై మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

The post బాలుడి ప్రాణం తీసిన వీడియో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.