విద్యుదాఘాతంతో బాలుడు మృతి

Electrocutionనిజామాబాద్: కోటగల్లి పూలాంగ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. ఐదో తరగతి చదువుతున్న ఆయాన్‌ఖాన్(11) అనే బాలుడు తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు, విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆయాన్ ఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనకు కారణమైన విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఆయాన్‌ఖాన్ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. పోస్టుమార్టం కోసం ఆయాన్‌ఖాన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Boy Dead By Electrocution In Kotagalli Poolang

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విద్యుదాఘాతంతో బాలుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.