ఇన్‌ఫెక్షన్లను దూరం చేసే ఆహారం

  వర్షాకాలం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. రోడ్డుపై అమ్మే ఆహారపదార్ధాలకు దూరంగా ఉండటమే మంచిది. ఇంట్లో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం.. 1. అల్లం, మిరియాలు, తేనె, పుదీనాతో తయారు చేసిన హెర్బల్ టీలు తీసుకోండి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. 2. తాజా ముల్లంగి రసాన్ని తాగితే దగ్గు, జలుబు […] The post ఇన్‌ఫెక్షన్లను దూరం చేసే ఆహారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వర్షాకాలం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. రోడ్డుపై అమ్మే ఆహారపదార్ధాలకు దూరంగా ఉండటమే మంచిది. ఇంట్లో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం..

1. అల్లం, మిరియాలు, తేనె, పుదీనాతో తయారు చేసిన హెర్బల్ టీలు తీసుకోండి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి.
2. తాజా ముల్లంగి రసాన్ని తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. శక్తిని తిరిగి పొందడానికి పండ్లు తినాలి. ఆపిల్, దానిమ్మ, అరటిపండ్లను ఎక్కువగా తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
4. మొక్కజొన్న, శనగపిండి, శనగలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి
5. బ్రౌన్‌రైస్, ఓట్స్, బార్లీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
6. వెల్లుల్లిని సూప్‌లలో, కూరలలో విధిగా వేయండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.
7. కాకరకాయ, పసుపు పొడి, మెంతులను ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి ఇన్‌ఫెక్షన్ల బారినుంచి మిమ్మల్ని కాపాడుతాయి.
8. పల్లి, ఆముదం, నువ్వుల నూనె బదులు తేలికగా ఉండే మొక్కజొన్న నూనెను వంటలలో ఉపయోగించాలి.
9. పచ్చి కూరగాయల బదులు మరిగించిన సలాడ్‌లు తీసుకోండి.
10. వీటితోపాటు రోజూ ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉంటే ఆరోగ్యానికి ఏలోటూ ఉండదు. ఒత్తిడికి దూరంగా ఉంటారు కూడా.

Boost Immune System with Herbal Teas

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇన్‌ఫెక్షన్లను దూరం చేసే ఆహారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: