సంబురాల దావత్

Chicken Garelu

 

ఆషాఢమాసంలో వచ్చే బోనాలకు ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారికి బోనాలు సమర్పించి తమ కోరికలను భక్తులు విన్నవించుకుంటారు. అనంతరం బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి విందు మాంసాహార విందు భోజనం చేసి సంతోషాన్ని పంచుకుంటారు.

చికెన్ గారెలు

బోన్‌లెస్ చికెన్: పావుకిలో, శనగపప్పు2 కప్పులు, గరం మసాలా2 టీస్పూన్లు, కారం1 టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ముద్ద, పచ్చిమిరపకాయలు4, ఉల్లిపాయలు2, పసుపుచిటికెడు, కొత్తిమీర కట్ట1, నూనె, ఉప్పు తగినంత.
తయారీ విధానం:

1. గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి.
2. చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
3. నానబెట్టిన శనగపప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
4. ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్, మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
5. కడాయిలో నూనె వేడిచేసి కొద్దిగా చికెన్ ముద్దను అరచేతిలో తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించాలి.
6. అతిథిలకు వేడివేడిగా వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తింటారు.

Sikandari Ron

 

సికిందరీ రాన్
కావాల్సిన పదార్థాలు: మటన్ జాయింట్: 6౦౦ గ్రా, కారం: 20గ్రా , అల్లం వెల్లుల్లి ముద్ద : తగినంత, కాశ్మీరీ కారం: 50గ్రా, గరం మసాలా: రెండు గ్రా, ఆవనూనె: 1౦౦ మి.లీ, పెరుగు: ౩౦౦ మి.లీ, ఉప్పు: రుచికి సరిపడా.

తయారీ విధానం:

1. కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి, ఉప్పు బాగా కలపాలి.
2. ఈ మిశ్రమాన్ని మటన్ జాయింట్‌కు పట్టించి ఫ్రిజ్‌లో కనీసం 6 గంటలు ఉంచాలి.

3. వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో రెండు లీటర్ల నీళ్లు పోసి మిగిలిన పదార్థాలు, మటన్ జాయింట్‌ను వేయాలి.

4. పాత్రకు సిల్వర్ పాయిల్ చుట్టేయాలి.
5. 160 డిగ్రీల్లో ఓవెన్‌ను ప్రీ హీట్ చేసుకుని దాన్లో పాత్రను ఉంచాలి.

6. ఇలా గంటంపావు ఉడికిస్తూ మధ్య మధ్యలో గమనిస్తూ ఎముక నుంచి మటన్ వేరు పడుతున్నప్పుడు ఓవెన్ నుంచి బయటకు తీయాలి.

7. దీన్ని మళ్లీ ఇనుప చువ్వకు గుచ్చి నిప్పులపై కాల్చాలి.

8. ఆ తర్వాత పైన సాస్‌తో అలంకరించి వడ్డించాలి.

Fish soup

 

చేపల పులుసు
కావలసినవి: చేపముక్కలు: కిలో, కారం: 2 , పచ్చిమిర్చి: నాలుగు, నూనె: అరకప్పు, కొత్తిమీర: కట్ట, మంచినీళ్లు: 2 కప్పులు, చింతపండు రసం: 2 కప్పులు, కరివేపాకు: 3 రెబ్బలు, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి: 4 , పసుపు: టీస్పూను, ఉప్పు: తగినంత, ధనియాలపొడి.
తయారుచేసే విధానం: కడిగిన చేప ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించి పక్కన ఉంచాలి. ముందుగానే చింతపండు రసాన్ని తీసిపెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, ధనియాలపొడి, చింతపండు రసం, నీళ్లు పోసి, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మీద తేలినట్లుగా నూనె వేసి మరిగించాలి. తరవాత మంట తగ్గించి సిమ్‌లో పావుగంటసేపు ఉడికించాలి. గ్రేవీ చిక్కబడి దాదాపుగా ఉడికింది అనుకున్నాక చేపముక్కలు, పచ్చిమిర్చి వేసి మరో పది నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. ముక్కల్ని కదపకుండా ఓసారి ఫోర్కుతో ఉడికిందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.

Egg spicy curry

 

ఎగ్ మసాలా కర్రీ
కావాల్సినవి: గుడ్లు6, ఉల్లిపాయలు2, టమాటాలు 2, పచ్చిమిర్చి5, గరంమసాలా అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్,1 టేబుల్ స్పూను, పసుపు పావు టీస్పూను, ధనియాల పొడి -1 టీ స్పూను,
తయారీ: గుడ్లు ఉడికించి రెండుగా కట్ చేయాలి. బాండ్లీలో నూనె పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించాలి. వేగాక టమాటా ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ , పసుపు వేయాలి. నూనె వేరు పడేవరకూ వేయించాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా గుడ్లు కలిపి మూత ఉంచి 10 నిముషాలు ఉడికించాలి. కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించాలి.

Bonalu Special Recipes

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సంబురాల దావత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.