ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం

Ujjaini-Bonaluహైదరాబాద్: లష్కర్ బోనాలు ఆదివారం తెల్లవారుజామున వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.
ఈ తెల్లవారుజామున 4.05 గంటలకు మొదటి పూజ ప్రారంభమైంది. తొలి బోనంతో పాటు వెండి తొట్టెలను మంత్రి అమ్మవారికి సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు తలసాని పేర్కొన్నారు. ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించారు. సోమవారం రంగం వేడుకలు నిర్వహించనున్నారు.
Bonalu Celebrations started in Telangana State

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.