షూటింగ్ లకు సిద్ధంగా లేను : అలియా భట్

Bollywood Actress Alia Bhatt Not Ready For Shootingsముంబయి : తాను షూటింగ్ లు చేసేందుకు సిద్ధంగా లేనని ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ తేల్చి చెప్పింది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు గత నాలుగు నెలల నుంచి ఆగిపోయాయి. దీంతో నటీనటులు ఇంటికే పరిమితమయ్యారు. అయితే షూటింగ్ లకు షరతులతో కూడిన అనుమతులు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అయినప్పటికీ పెద్ద సినిమాల షూటింగ్ లు మాత్రం జరగడం లేదు. ఎన్ టిఆర్, రామ్ చరణ్ లు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కొంత భాగం జరిగింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు నుంచి  పున: ప్రారంభించాలన్న ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న అలియా భట్ మాత్రం తాను షూటింగ్ లకు సిద్ధంగా లేనని రాజమౌళికి తేల్చి చెప్పినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇప్పట్లో తాను షూటింగ్ లకు హాజరు కాలేనని అలియా భట్ చెప్పడంతో ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాతనే షూటింగ్ ను ప్రారంభించాలని కొందరు సినిమా యూనిట్ సభ్యులు రాజమౌళికి సూచించారని, దీనిపై ఆయన ఆలోచన చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post షూటింగ్ లకు సిద్ధంగా లేను : అలియా భట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.