ఫీడింగ్ ఇండియాతో చేతులు కలిపిన బిఒబి, మాక్స్ బూపా

Feeding India

 

న్యూఢిల్లీ: స్వచ్ఛంద సంస్థ ఫీడింగ్ ఇండియాతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా(బిఒబి), ఆరోగ్య బీమా సంస్థ మాక్స్ బుపా చేతులు కలిపాయి. రెండు నెలల వ్యవధిలో 1,12,000 మీల్స్‌ను బలహీనవర్గాల వారికి అందించేందుకు ఈ సంస్థలు ముందుకొచ్చాయి. ఆకలికి వ్యతిరేకంగా దేశం చేసే పోరాటానికి తోడ్పడడం, బలహీన వర్గాల వారు ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి వీలు కల్పించేలా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. దేశంలోని 100 నగరాల్లో వివిధ హంగర్ పాయింట్స్ లో ‘స్వస్థనీవ్’ కార్యక్రమ నిర్వహణకు గాను బ్యాంక్ ఆఫ్ బరోడా, మాక్స్ బుపా సంస్థలు కలసి లాభాపేక్షరహిత సంస్థ ఫీడింగ్ ఇండియాతో భాగస్వాములుగా మారాయి.

BOB, Max Bupa Health Insurance join with Feeding India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫీడింగ్ ఇండియాతో చేతులు కలిపిన బిఒబి, మాక్స్ బూపా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.