క్యూ4, ఎన్నికల ప్రభావం

  ముంబై: క్యూ4(జనవరిమార్చి) ఫలితాలు, సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ వారంలోనూ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి, తయారీ రంగం ఉత్పత్తి వంటి గణాంకాలను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు. ఈ వారంలో సేవా రంగానికి సంబంధించిన పిఎంఐ డేటా వెలువడనుంది. అలాగే పలు బ్లూచిప్ కంపెనీలు ఈ వారంలో క్యూ4 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇప్పటికే ఐటి, ఎఫ్‌ఎంసిజి తదితర రంగాల కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించాయి. అలాగే […] The post క్యూ4, ఎన్నికల ప్రభావం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: క్యూ4(జనవరిమార్చి) ఫలితాలు, సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ వారంలోనూ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి, తయారీ రంగం ఉత్పత్తి వంటి గణాంకాలను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు. ఈ వారంలో సేవా రంగానికి సంబంధించిన పిఎంఐ డేటా వెలువడనుంది. అలాగే పలు బ్లూచిప్ కంపెనీలు ఈ వారంలో క్యూ4 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇప్పటికే ఐటి, ఎఫ్‌ఎంసిజి తదితర రంగాల కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించాయి. అలాగే ఇంకా చాలా కంపెనీలు నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. మొబైల్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ప్రైవేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఈ నెల 6న, అలాగే 7వ తేదీన వేదాంతా, ఈనెల 9న ఇత ర దిగ్గజాలు ఏసియన్ పెయింట్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌లు ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇదే బాటలో 10న ఎల్ అండ్ టి, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఫలితాలు ప్రకటించనున్నాయి. సార్వత్రిక ఎ న్నికలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఐదో దశ పోలింగ్‌ను 6న నిర్వహించనుంది. 7రాష్ట్రాల్లో 51 లోక్‌సభ సీ ట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 19కల్లా అన్ని దశల పోలింగ్ పూర్తి అవుతాయి. ఆ తర్వాత ఫలితా లు 23న వెల్లడించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో మారకంలో రూపా యి కదలికలను పరిశీలించాలి. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు మార్కెట్ల ను ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Bluechip companies will reveal the results of Q4 this week

The post క్యూ4, ఎన్నికల ప్రభావం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: