బ్లైండ్ ఫోల్డ్ మోటార్‌సైకిల్ రైడ్ షో

  ఖమ్మం: అంతర్జాతీయ ఇంద్రజాల కళాకారులు జాదుగర్ ఆనంద్ తన ఖమ్మం ప్రదర్శనలో భాగంగా బుధవారం ఖమ్మం నగరంలో బ్లైండ్ ఫోల్డ్ మోటార్‌సైకిల్ రైడ్ షో నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిర్వహించిన ఈ షోలో ఆయన శిష్యులు ఫరూక్ ఈ సాహసం చేసారు. తొలుత ఫరూఖ్ కళ్లకు గంతలు కట్టుకోవడాన్ని ఎసిపి సదానిరంజన్, ట్రాఫిక్ సిఐ చిట్టిబాబు పరిశీలించారు స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఖమ్మం ట్రాఫిక్ ఎసిపి పి. సదానిరంజన్ […]

 

ఖమ్మం: అంతర్జాతీయ ఇంద్రజాల కళాకారులు జాదుగర్ ఆనంద్ తన ఖమ్మం ప్రదర్శనలో భాగంగా బుధవారం ఖమ్మం నగరంలో బ్లైండ్ ఫోల్డ్ మోటార్‌సైకిల్ రైడ్ షో నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిర్వహించిన ఈ షోలో ఆయన శిష్యులు ఫరూక్ ఈ సాహసం చేసారు. తొలుత ఫరూఖ్ కళ్లకు గంతలు కట్టుకోవడాన్ని ఎసిపి సదానిరంజన్, ట్రాఫిక్ సిఐ చిట్టిబాబు పరిశీలించారు స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఖమ్మం ట్రాఫిక్ ఎసిపి పి. సదానిరంజన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎసిపి మాట్లాడుతూ ప్రపంచంలో యుద్దాలకన్నా రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది మృతి చెందుతున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రాణాలు బలికాకుండా చూసుకోవాలని కోరారు.

కళ్లకు నల్లటి వస్త్రంతో ఏ మాత్రం కనపడకుండా గంతలు కట్టుకుని మోటార్‌సైకిల్‌పై నగరంలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఈ ప్రదర్శన నిర్వహించారు. భక్తరామదాసు కళాక్ష్రేతం నుండి ప్రారంభమైన ఈ షో మయూరిసెంటర్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, నయాబజార్, తిరిగి బస్టాండ్ సెంటర్, వైరారోడ్, జిల్లా పరిషత్ సెంటర్, ఎన్‌టిఆర్ సర్కిల్, ఇల్లందు క్రాస్‌రోడ్, మమత హాస్పిటల్ రోడ్, మీదుగా యమహా షో రూం వరకు సాగింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో జాదూగర్ ఆనంద్‌తోపాటు యమహా షోరూం ఎండి సాయిహర్ష, సిబ్బంది, మస్తాన్, జేమ్స్, ,ట్రాపిక్ సిఐ చిట్టిబాబు, స్తానిక మెజిషీయన్ కె.వి. చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా త్రివేణి, న్యూవిజన్ విద్యార్దులు, డామ్రో ఫర్నీచర్ వారు జూనియర్ జాదూగర్ ఆనంద్ రోడ్‌షోకు ఘనంగా స్వాగతం పలికారు.

Blindfold Motorcycle Ride Show in Khammam

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: