జిల్లెలగూడలో పేలుడు : ఇద్దరికి తీవ్ర గాయాలు

Blasting  హైదరాబాద్: మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న జిల్లెలగూడ విజయనగర్ కాలనీలో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మహిళతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.  చెత్త కుప్పల్లో ఉన్న టిఫిన్ బాక్స్‌లో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గాయపడిన వారిని చెత్త ఏరుకునే వారిగా గుర్తించారు. చెత్త కుప్పల్లో ఈ టిఫిన్ బాక్స్ ను పెట్టిందెవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Blasting In Jillelaguda At Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జిల్లెలగూడలో పేలుడు : ఇద్దరికి తీవ్ర గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.