భారీగా పెరిగిన నిరుద్యోగం

        ఆర్థిక వ్యవస్థ అపూర్వ పతనావస్థ గురించి ఎన్ని హెచ్చరికలు మరెన్ని ప్రమాద సంకేతాలు వెలువడుతున్నా కొట్టి పారేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరో ప్రళయ చిహ్నం వెలువడింది. నిరుద్యోగం పెరుగుదల రేటు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు మాసంలో 8 శాతంగా నమోదయింది. భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐఇ) తేల్చిన ఈ చేదు వాస్తవం ముంచుకొచ్చిన ముప్పును కళ్ల […] The post భారీగా పెరిగిన నిరుద్యోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

        ఆర్థిక వ్యవస్థ అపూర్వ పతనావస్థ గురించి ఎన్ని హెచ్చరికలు మరెన్ని ప్రమాద సంకేతాలు వెలువడుతున్నా కొట్టి పారేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరో ప్రళయ చిహ్నం వెలువడింది. నిరుద్యోగం పెరుగుదల రేటు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు మాసంలో 8 శాతంగా నమోదయింది. భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐఇ) తేల్చిన ఈ చేదు వాస్తవం ముంచుకొచ్చిన ముప్పును కళ్ల ముందుంచింది. ఈ స్థాయి నిరుద్యోగం పెరుగుదల 2016 సెప్టెంబర్ తర్వాత ఇదే మొదటి సారి కావడం గమనించవలసిన అంశం. ఆగస్టు నెలలో పట్టణ, గ్రామీణ రంగాలు రెండిం టా నిరుద్యోగం భారీగా పెరిగింది.

పట్టణ ప్రాంతాల్లో 9.6 శాతానికి, గ్రామీణంలో 7.8 శాతానికి చేరుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అతి కనిష్ఠ స్థాయి 5 శాతం వృద్ధి రేటు నమోదయింది. నిరుద్యోగ రేటు ఇంతగా పెరగడం దాని ప్రభావమేనని స్పష్టపడుతున్నది. ప్రఖ్యాత ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ దుస్థితి గురించి ఇటీవలే తీవ్రంగా హెచ్చరించారు. తయారీ రంగం కుంగుబాటు ఘోర ఆర్థిక పతనానికి ప్రబల సంకేతమని, వ్యవసాయ రంగ సంక్షోభమూ ఇందుకొక కారణమని, పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్ఠ జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) అమలు వంటి తప్పుడు నిర్ణయాల దుష్ఫలితాలింకా వెంటాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఆయన హెచ్చరికను పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం ఎదురు దాడికి దిగింది. భారత్, ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నదని, మన్మోహన్‌వి తప్పుడు భయాలని, దురుద్దేశ పూరితమైనవని కొట్టి పారేసింది.

అయితే పాలక బిజెపి సన్నిహిత మిత్ర పక్షం శివసేన మన్మోహన్ హెచ్చరికను సమర్థించింది, ఆయనను శ్లాఘించింది. ఆయన మాటలను పెడ చెవిన పెట్టడం, రాజకీయ దృష్టితో కొట్టి పారేయడం తగదు గాక తగదని హితవు చెప్పింది. వాస్తవానికి ప్రభుత్వం కూడా ఆర్థిక రంగంలో తలెత్తిన అపూర్వ అసాధారణ సంక్షోభాన్ని పసికట్టింది. అందుకు విరుగుడు చర్యలు కొన్నింటిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ప్రకటించారు. సంపన్న వర్గాలపై బడ్జెట్‌లో విధించిన సూపర్ సర్ చార్జీని ఉపసంహరించుకున్నారు. కార్ల పరిశ్రమలో చెలరేగుతున్న మాంద్యం మీద చన్నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. అయితే సంక్షోభ తరణానికి ఈ చర్యలు చాలవని బోధపడుతున్నది. అందుచేత నిపుణులను సంప్రదించి సరికొత్త వ్యూహాలను అమలు చేయవలసిన అవసరం కనిపిస్తున్నది.

వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న దుస్థితిని తొలగించ వలసి ఉంది. రైతు రాబడి పెరిగే చర్యలు చేపట్ట వలసి ఉంది. దానితో డిమాండ్ పెరిగి పారిశ్రామిక రంగంలో నిరుద్యోగం అదుపులోకి రాగల అవకాశాలు కలుగుతాయి. దేశంలో అసలు సమస్య కేవలం నిరుద్యోగమే కాదని ఉన్న ఉద్యోగాలు కూడా తగినంతగా వేతనాలు లేని చిరుద్యోగాలని నిపుణులు భావిస్తున్నారు. సిమెంటు, ఉక్కు, ఇతర నిర్మాణ రంగ పరికరాలపై అసాధారణ జిఎస్‌టి విధింపు కీలకమైన ఆ రంగంలో సంక్షోభానికి దారి తీసిందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బ తీసిందన్న విశ్లేషణ సహేతుకమైన దే. వస్తు వినియోగిత తగ్గడం, ప్రైవేటు పెట్టుబడులు కింది చూపు చూడడం నిరుద్యోగాన్ని భవిష్యత్తులో మరింతగా పెంచే ప్రమాదమున్నది. నిర్మాణ, వ్యవసాయ రంగాలు దెబ్బ తినడం వల్ల దాని దుష్ప్రభావం ఆటోమొబైల్ పరిశ్రమ మీద అసాధారణంగా పడింది.

కార్లు, మోటారు సైకిళ్ల కొనుగోళ్లు పతనమై పరిశ్రమలు, డీలర్ షిప్పులు బలహీనపడ్డాయి. పర్యవసానంగా దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు, వాటిపై వచ్చే ఆదాయాలు నష్టపోవడం వల్ల ఆమేరకు మార్కెట్‌లో అన్ని వస్తువుల గిరాకీ పడిపోతుంది. అది అదనపు నిరుద్యోగానికి దారి తీస్తుంది. అంతకు ముందు 45 ఏళ్లుగా లేని రీతిలో 201718లో నిరుద్యోగ పెరుగుదల 6.1 శాతంగా నమోదు కావడమే భయాందోళనలకు దారి తీసింది. గత ఆగస్టు నెలలో నమోదయిన 8 శాతం రేటు అలాగే కొనసాగితే అదింకెంత ఉపద్రవాన్ని దాపురింప చేస్తుందో చెప్పనక్కరలేదు. మనది ఉద్యోగ కల్పన లేని వృద్ధి వ్యూహమని మన్మోహన్ సింగ్ వేలెత్తి చూపించారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘనంగా చూపుకుంటున్న తక్కువ ద్రవ్యోల్బణం రేటు బలుపు కాదు, వాపేనని అన్నారు. రైతుల ఆదాయాలు దారుణంగా పడిపోడం వల్ల సంభవించిందని వివరించారు. దేశంలో 50 శాతం జనాభా చేతి నిండా పనుల్లేక, జేబు నిండా రాబడి కరవై ఉన్న వర్తమాన సంక్షుభిత నేపథ్యం ఇంకెంత కష్టాలను తెస్తుందో ఊహించలేము. ప్రజలకు కూడు, గుడ్డ కరవు చేస్తున్న ఈ దారుణ పరిస్థితిని తొలగించకుండా ఇతరత్రా ఎటువంటి చర్యలు తీసుకున్నా ప్రయోజనం సున్నా.

Black unemployment rates falls to 8 percent in August

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారీగా పెరిగిన నిరుద్యోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: