బిజెపికి ఓటేయమంటే కాంగ్రెస్‌కు వేశాడని ఘాతుకం…

ఛండీగఢ్: కాంగ్రెస్‌కు ఓటేసిన కజిన్ పై ఓ బిజెపి నేత తుపాకితో కాల్పులు జరిపిన ఘటన హరియాణాలోని ఝాజర్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన మే 12న చోటుచేసుకుంది. సాధరణ ఎన్నికలలో భాగంగా జరిగిన ఆరో విడత ఎన్నికల్లో బిజెపి మండలస్థాయి నేత అయిన ధర్మేంద్ర సిలానీ సొంత కజిన్ రాజా సింగ్ కాంగ్రెస్‌కు ఓటేశాడు. విషయం తెలుసుకున్న సిలానీ అతడిపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. రెండుసార్లు కాళ్లపైన, ఓసారి కడుపులోనూ కాల్చాడు. అనంతరం […] The post బిజెపికి ఓటేయమంటే కాంగ్రెస్‌కు వేశాడని ఘాతుకం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఛండీగఢ్: కాంగ్రెస్‌కు ఓటేసిన కజిన్ పై ఓ బిజెపి నేత తుపాకితో కాల్పులు జరిపిన ఘటన హరియాణాలోని ఝాజర్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన మే 12న చోటుచేసుకుంది. సాధరణ ఎన్నికలలో భాగంగా జరిగిన ఆరో విడత ఎన్నికల్లో బిజెపి మండలస్థాయి నేత అయిన ధర్మేంద్ర సిలానీ సొంత కజిన్ రాజా సింగ్ కాంగ్రెస్‌కు ఓటేశాడు. విషయం తెలుసుకున్న సిలానీ అతడిపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. రెండుసార్లు కాళ్లపైన, ఓసారి కడుపులోనూ కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో గాయపడి కుప్పకూలిన రాజా సింగ్‌ను తక్షణమే దవాఖానకు తరలించారు.

ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సిలానీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజా సింగ్, అతని కుటుంభాన్ని బిజెపికి ఓటేయాల్సిందిగా సిలానీ కోరాడని, అయితే వారు ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఓటెయ్యాడాన్ని జీర్ణించుకోలేకపోయిన ధర్మేంద్ర ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

BJP Supporter Shoots Cousin for Voting for Congress

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిజెపికి ఓటేయమంటే కాంగ్రెస్‌కు వేశాడని ఘాతుకం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: