జ‌మ్మూక‌శ్మీర్‌లో బిజెపి సర్పంచ్ హత్య

  శ్రీన‌గ‌ర్ : బిజెపికి చెందిన ఓ సర్పంచ్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం తెల్ల‌వారుజామున జరిగింది. ఖాజీగండ్ బ్లాక్ లోని వీసు గ్రామ సర్పంచ్ సజద్ అహ్మద్ ఖాందయ్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాల పాలైన ఆయన్ను అనంతనాగ్ లో ఉన్న జిఎంసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సజద్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. గత రెండు రోజుల్లో ఉగ్రవాదులు రెండు దాడులు చేశారు. […] The post జ‌మ్మూక‌శ్మీర్‌లో బిజెపి సర్పంచ్ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శ్రీన‌గ‌ర్ : బిజెపికి చెందిన ఓ సర్పంచ్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం తెల్ల‌వారుజామున జరిగింది. ఖాజీగండ్ బ్లాక్ లోని వీసు గ్రామ సర్పంచ్ సజద్ అహ్మద్ ఖాందయ్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాల పాలైన ఆయన్ను అనంతనాగ్ లో ఉన్న జిఎంసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సజద్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. గత రెండు రోజుల్లో ఉగ్రవాదులు రెండు దాడులు చేశారు. ఆగస్టు 4న బిజెపి సర్పంచ్ ఆరిఫ్ అహ్మద్ పై కాల్పులు జరిపారు. దీంతో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. జూన్ నెలలో కాంగ్రెస్ సర్పంచ్ అజయ్ పండిత, జూలైలో బిజెపి నేత వసీం బరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post జ‌మ్మూక‌శ్మీర్‌లో బిజెపి సర్పంచ్ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: