కోల్‌కతాలో అమిత్ షా భారీ ర్యాలీ

  కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో-తృణమూల్ కాంగ్రెస్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారంనాడు కోల్‌కతాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. జై శ్రీరామ్, మోడీ నినాదాల మధ్య ప్రత్యేక వాహనంలో అమిత్‌షా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రామాయణంలోని కీలక పాత్రల వేషధారులు సైతం ఓపెన్ టాప్ రథం పై కనిపించి అలరించారు. షా కాన్వాయ్ ముందు జానపద నృత్యకళాకారులు ప్రదర్శనలు చేస్తూ ముందుకు సాగారు. అమిత్‌షా రోడ్‌షోకు ముందు కోల్‌కతాలో ఉదయం కొద్దిపాటి ఉద్రిక్తతలు తలెత్తాయి. […] The post కోల్‌కతాలో అమిత్ షా భారీ ర్యాలీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో-తృణమూల్ కాంగ్రెస్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారంనాడు కోల్‌కతాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. జై శ్రీరామ్, మోడీ నినాదాల మధ్య ప్రత్యేక వాహనంలో అమిత్‌షా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రామాయణంలోని కీలక పాత్రల వేషధారులు సైతం ఓపెన్ టాప్ రథం పై కనిపించి అలరించారు. షా కాన్వాయ్ ముందు జానపద నృత్యకళాకారులు ప్రదర్శనలు చేస్తూ ముందుకు సాగారు. అమిత్‌షా రోడ్‌షోకు ముందు కోల్‌కతాలో ఉదయం కొద్దిపాటి ఉద్రిక్తతలు తలెత్తాయి. బిజెపి పోస్టర్లు, జెండాలను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు తొలగించారు. మమతా బెనర్జీ గూండాలు, పోలీసులే పార్టీ పోస్టర్లు, జెండాలు తొలగించారని, విషయం తెలిసిన తాము అక్కడకు చేరుకోగానే వారంతా పరారయ్యారని బిజెపి నేత కైలాష్ విజయ్‌వర్గీయ తెలిపారు. మరోవైపు అమిత్ షా ర్యాలీ సమ యంలో హింస చెలరేగింది. ఈ సమయంలో అమిత్ షా కాన్వాయ్‌పైకి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కర్రలు, రాళ్లు విసిరేయడంతో బిజెపి కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డు పక్కన ఉన్న వాహనాలకు కొందరు నిప్పు అంటించారు. తృణ మూల్ కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నట్లు తెలుస్తోంది.

BJP President Amit shah road show in Kolkata

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కోల్‌కతాలో అమిత్ షా భారీ ర్యాలీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: