కోర్టును ఆశ్రయించిన సాక్షి మిశ్రా దంపతులు

అలహాబాద్/లక్నో: దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బిజెపి ఎంఎల్‌ఏ రాజేష్ మిశ్రా కూతురు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు…ఒక రోజు తర్వాత ఆమె, ఆమె భర్త తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. బరేలీలోని బిథారీ చెయిన్‌పూర్ ఎంఎల్‌ఏ రాజేష్‌మిశ్రా మాట్లాడుతూ తను ఎవరినీ బెదిరించలేదని, సొంతంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ తన కూతురికి ఉందని చెప్పారు. ఆయన కూతురు […] The post కోర్టును ఆశ్రయించిన సాక్షి మిశ్రా దంపతులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అలహాబాద్/లక్నో: దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బిజెపి ఎంఎల్‌ఏ రాజేష్ మిశ్రా కూతురు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు…ఒక రోజు తర్వాత ఆమె, ఆమె భర్త తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. బరేలీలోని బిథారీ చెయిన్‌పూర్ ఎంఎల్‌ఏ రాజేష్‌మిశ్రా మాట్లాడుతూ తను ఎవరినీ బెదిరించలేదని, సొంతంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ తన కూతురికి ఉందని చెప్పారు. ఆయన కూతురు సాక్షి మిశ్రా (23), ఆమె భర్త అజితేష్ కుమార్ (29) గురువారం లేనందువల్ల జస్టిస్ వెకె శ్రీవాత్సవ ఈ కేసు విచారణను జూలై 15కు వాయిదా వేశారు. బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో సాక్షి తన భర్తతో ప్రశాంతంగా బతకనివ్వమని తండ్రితో చెబుతున్నట్టు వినిపించింది. తండ్రి, సోదరుడు, వారి తాలూకు వాళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందని, పోలీస్ రక్షణ కల్పించాలని కూడా ఆమె విజ్ఞప్తి చేసింది. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి తమకు రక్షణ కావాలని కోరారు.

తాము బ్రాహ్మణులం కాబట్టి దళితుడినిపెళ్లి చేసుకోవడంపట్ల తమ తండ్రి అసంతృప్తితో ఉన్నట్టు ఆ పిటిషన్‌లో తెలిపారు. తాము మేజర్లమని, ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, కాబట్టి తమను మనశ్శాంతిగా బతకనివ్వమని ఎంఎల్‌ఏను, పోలీసుల్ని వారు కోరారు. అయితే ఎంఎల్‌ఏ ఆ ఆరోపణను తోసిపుచ్చారు. ‘మీడియాలో నాపై జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం’ అని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ‘నేను, మా కుటుంబం మా పన్లలో మేమున్నాం. నా నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించిన పనులు చేస్తున్నాను. ప్రస్తుతం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉన్నాను. నా వల్ల ఎవరికీ ముప్పు లేదు’ అని రాజేష్ మిశ్రా చెప్పారు. ఇలా ఉండగా, ఆ దంపతులకు రక్షణ కల్పించాల్సిందిగా బరేలీ పోలీస్ అధికారిని అంతకు ముందు కోరినట్టు డిప్యూటీ ఇన్‌స్‌పెక్టర్ జనరల్ ఆర్‌కె పాండే చెప్పారు. తన తండ్రికి మద్దతు ఇవ్వవద్దని సాక్షి ఇతర ఎంపీలు, ఎంఎల్‌ఏలను కూడా కోరారు.

BJP MLA daughter moves High Court for protection

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కోర్టును ఆశ్రయించిన సాక్షి మిశ్రా దంపతులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: