బిజెపి ఎంఎల్ఎ ఆత్మహత్యా?

BJP MLA commit suicide at west bengal

 

కోల్ కతా: బిజెపి ఎంఎల్ఎ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్ లోని హెమ్తాబాద్ నియోజకవర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 2019లో ఎంఎల్ఎ దేవేంద్ర నాథ్ సిపిఐఎం పార్టీలో నుంచి బిజెపిలో చేరారు. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు వచ్చి దేవేంద్రనాథ్ ను బైక్ పై ఎక్కించుకొని వెళ్లారు. సోమవారం ఉదయం బిందాల్ ప్రాంతంలోని పాడుపడ్డ దుకాణంలో ఎంఎల్ఎ ఉరి కొయ్యకు వేలాడుతుండడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవేంద్రనాథ్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించారని ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ఆరోపణలు చేస్తున్నారు. ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

The post బిజెపి ఎంఎల్ఎ ఆత్మహత్యా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.