నా కూతురిని లవ్ జిహాద్‌కి బలి చేసింది కాంగ్రెస్ ఎంఎల్‌ఎనే

  భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అరిఫ్ మసూద్ లవ్ జిహాద్‌ను పెంచిపోషిస్తున్నారని భోపాల్ మాజీ బిజెపి ఎంఎల్‌ఎ సురేందర్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురు భారతి అక్టోబర్ 17 నుంచి కనిపించడం లేదన్నారు. భారతి మానసిక స్థితి బాగోలేకపోవడంతో గత నాలుగు సంవత్సరాల చికిత్స అందిస్తున్నామని సురేందర్ తెలిపారు. ప్రస్తుతం తమ కుమార్తె అంతగా బాగోలేదన్నారు. తమ కూతురిని లవ్ జిహాద్ పేరుతో అరిఫ్ హింసిస్తున్నారని ఆరోపణలు చేశారు. భారతి జబల్‌పూర్ హైకోర్టులో […] The post నా కూతురిని లవ్ జిహాద్‌కి బలి చేసింది కాంగ్రెస్ ఎంఎల్‌ఎనే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అరిఫ్ మసూద్ లవ్ జిహాద్‌ను పెంచిపోషిస్తున్నారని భోపాల్ మాజీ బిజెపి ఎంఎల్‌ఎ సురేందర్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురు భారతి అక్టోబర్ 17 నుంచి కనిపించడం లేదన్నారు. భారతి మానసిక స్థితి బాగోలేకపోవడంతో గత నాలుగు సంవత్సరాల చికిత్స అందిస్తున్నామని సురేందర్ తెలిపారు. ప్రస్తుతం తమ కుమార్తె అంతగా బాగోలేదన్నారు. తమ కూతురిని లవ్ జిహాద్ పేరుతో అరిఫ్ హింసిస్తున్నారని ఆరోపణలు చేశారు. భారతి జబల్‌పూర్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తాను వేరే కులానికి చెందిన వ్యక్తితో కలిసి ఉంటున్నానని భారతి కోర్టుకు తెలిపింది. తనకు పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. తన కుటుంబానికి వ్యతిరేకంగా ఆమె పలు ఆరోపణలు చేసింది. తన కుటుంబ నుంచి బయటకు వెళ్లిన తరువాత సంతోషంగా ఉన్నానని వెల్లడించింది.

 

BJP Leader’s “Love Jihad” Attack On Congress MLA

 

JP Leader’s “Love Jihad” Attack On Congress MLA

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నా కూతురిని లవ్ జిహాద్‌కి బలి చేసింది కాంగ్రెస్ ఎంఎల్‌ఎనే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: