యుపిలో బిజెపి నేత దారుణ హత్య

BJP Leader Tomarలక్నో : యుపిలో బిజెపి  నేత డాక్టర్‌ బిఎస్‌ తోమర్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లా మసూరి ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు బిఎస్ తోమర్ పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. తోమర్ పార్టీ కార్యాలయంలో ఉన్న సమయంలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తోమర్ మృతి చెందాడు. పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోమర్ పై కాల్పులు జరిపిన అనంతరం దుండగులు తామొచ్చిన బొలెరో వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కక్షల కారణంగానే తోమర్ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం తోమర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

BJP Leader Tomar Shot Dead In UP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post యుపిలో బిజెపి నేత దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.