కవిత ఓటమి వెనుక నా పాత్ర : బాబు మోహన్

హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కల్వకుంట్ల కవిత ఓటమి వెనుక తన పాత్ర ఉందని బిజెపి నేత, నటుడు బాబు మోహన్ బాబు పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి బలపడుతోందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ లో కవితను ఓడించేందుకు సర్వశక్తులను అడ్డుపెట్టామని, దీంతో  తమ పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ ఎంపిగా విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్ లో బిజెపిలోకి […] The post కవిత ఓటమి వెనుక నా పాత్ర : బాబు మోహన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కల్వకుంట్ల కవిత ఓటమి వెనుక తన పాత్ర ఉందని బిజెపి నేత, నటుడు బాబు మోహన్ బాబు పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి బలపడుతోందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ లో కవితను ఓడించేందుకు సర్వశక్తులను అడ్డుపెట్టామని, దీంతో  తమ పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ ఎంపిగా విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్ లో బిజెపిలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆయన చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ అధిష్ఠానం ఏ పని అప్పగించినా అంకితభావంతో పని చేస్తానని బాబు మోహన్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

BJP Leader Babu Mohan Comments on Kavitha

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కవిత ఓటమి వెనుక నా పాత్ర : బాబు మోహన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: